వావ్‌.. ఈ గేదె ట్యాలెంట్ మామూలుగా లేదుగా..

ఈ సృష్టిలో ప్రతీ వ్యక్తికి ఏదో టాలెంట్ క‌చ్చితంగా ఉండే ఉంటుంది.కానీ దాన్ని గుర్తించి అందులోరాణించేవారు స్టార్లు అవుతారు.

పెద్ద పెద్ద సెల‌బ్రిటీలు అవుతారు.అలాంటి వారినే ప్రపంచం నెత్తిన పెట్టుకుంటుంది.

ఇక ఏ ట్యాలెంట్ లేద‌ని బావిలో కప్పలా బతికాల‌ని ఎవ్వ‌రూ అనుకోకూడ‌దు.ఇంకా చెప్పాలంటే ఒక‌ప్పుడు అవ‌కాశం లేక మ‌రుగున ప‌డ్డ ట్యాలెంట్ ఇప్పుడు సోషల్ మీడియా పుణ్య‌మా అని ప్ర‌తి ఒక్క‌రి ట్యాలెంట్ ప్ర‌పంచానికి తెలుస్తోంది.

ఎక్క‌డ ఏం జరిగా ఇట్టే ఇందులో వైర‌ల్ అయిపోతుండ‌టం మ‌నం చూస్తూనే ఉన్నాం.

అయితే క‌వేలం మ‌నుషుల్లో మాత్ర‌మే కాదండోయ్ జంతువుల‌కు కూడా ఏదో ఒక ట్యాలెంట్ ఉంటుంద‌ని ఇప్ప‌టికే ఎన్నో జంతువులు నిరూపించాయి.

కొన్ని జంతువుల్లో అయితే అసాధారణమైన ప్రతిభ కూడా ఉంటుంద‌ని ఈ వీడియో చూశాక మీరే అంటారేమో.

గేదె టాలెంట్ ను నిరూపించే ఈ వీడియో సోష‌ల్ మీడిఆయ‌లో హల్‌చల్ చేస్తోంది.

ఈ వీడియోను జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తే ఆ గేదెను దాని ప్లేస్‌లోని ఓ దుంగకు కట్టేయ‌డం మ‌నం చూడొచ్చు.

కాగా గేదె అక్క‌డ త‌న‌కు గ‌డ్డి వేసేందుకు ఉంచే టబ్‌ను అలా ఖాళీగా వ‌దిలేయం ఎందుక‌నుకున్న‌ట్టు ఉంది.

"""/"/ ఇంక ఆల‌స్యం ఎందుక‌ని వెంట‌నే దాన్ని త‌న కొమ్ముల మీద‌కు తీసుకుని స‌ర‌దాగా ఆటాడుకుంది.

ఆ ట‌బ్‌ను గిరా గిరా తిప్పేస్తూ ఫుల్‌బాల్, వాలిబాల్ ను కొంద‌రు ఎలాగైతే చేతి వేలి మీద తిప్పుతారో సేమ్ అలాగే ఆ గేదె కూడా తిప్పింది.

ఒక కొమ్ము మీద లెఫ్ట్ నుంచి రైట్‌కి, మ‌ళ్లీ ఇటు నుంచి అటు అన్న‌ట్టు కింద ప‌డ‌కుండా తిప్పేయ‌డం చూస్తుంటే మ‌న కండ్ల‌ను మ‌న‌మే న‌మ్మ‌లేకుండా ఉంటామేమో అనిపిస్తుంది.

ఇక ఇదంతా కూడా అక్క‌డే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి ట్విట్టర్‌లో పోస్టు చేయ‌డంతో విప‌రీతంగా వైర‌ల్ అయిపోతుంది.

చేపల వర్షం ఎప్పుడైనా చూసారా.. వీడియో వైరల్..