ఈ బాలుడు మామూలు టాలెంటెడ్ కాదు.. 14 ఏళ్ల వయసులోనే స్పేస్‌ఎక్స్‌లో జాబ్ కొట్టేశాడు..

సాధారణంగా 14 ఏళ్ల వయసులో చాలామంది పిల్లలు సరదాగా ఆడుకుంటూ లైఫ్ గడిపేస్తుంటారు.

లేదంటే తమ చదువులతో కుస్తీ పడుతుంటారు.అయితే 14 ఏళ్ల వయసు ఉన్న కైరాన్ క్వాజీ ( Kieran Kwazi )మాత్రం సాధారణ పిల్లలకు విరుద్ధం.

ఈ బాలుడు చిన్న వయసులోనే ఉన్నత విద్యలు పూర్తి చేశాడు.తాజాగా ఎలాన్ మస్క్‌కి( Elon Musk ) చెందిన ప్రతిష్టాత్మక స్పేస్‌ఎక్స్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసే ఆఫర్ కూడా సంపాదించాడు.

అలా క్వాజీ స్పేస్‌ఎక్స్ ఇప్పటివరకు హైర్ చేసిన ఉద్యోగులలో అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు.

"""/" / శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన క్వాజీ తన 14 ఏళ్ల వయసులోనే శాంటా క్లారా యూనివర్సిటీ( Santa Clara University ) నుంచి ఇంజనీరింగ్ విద్యార్థిగా పట్టభద్రుడయ్యాడు.

అతను లింక్డ్‌ఇన్‌లో స్పేస్‌ఎక్స్ స్టార్‌లింక్ టీమ్‌లో తన కొత్త ఉద్యోగాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించాడు.

క్వాజీ కేవలం తొమ్మిదేళ్ల వయసులో లాస్ పొసిటాస్ కమ్యూనిటీ కాలేజీలో చేరాడు.ఈ బాలుడు చిన్నతనం నుంచే చదువులో ప్రతిభ కనబరిచాడు.

టీచర్లు సైతం ఈ పిల్లాడికి మామూలు స్కూళ్లు పనికి రావని, గొప్ప యూనివర్సిటీలు టీచర్లు మాత్రమే ఇతడి తెలివికి తగ్గట్టు బోధించగలరని తల్లిదండ్రులకు చెప్పారట.

తమ కుమారుడు అంత పెద్ద మేధావి అని తెలిసి తల్లిదండ్రులు కూడా ఆశ్చర్యపోయారట.

"""/" / ఈ బాలుడు చిన్న వయసులోనే గణితంలో అసోసియేట్ ఆఫ్ సైన్స్ డిగ్రీ అందుకున్నాడు.

అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్( Artificial Intelligence ) (AI), మెషిన్ లెర్నింగ్ (ML)లపై కూడా మంచి పట్టు సాధించాడు.

ఈ సబ్జెక్టులపై టెక్నాలజీ కంపెనీ, సైబర్ ఇంటెలిజెన్స్ స్టార్ట్-అప్‌లో ఇంటర్న్‌షిప్‌లు చేయడం ద్వారా ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్‌ను పొందాడు.

అతనిలో అద్భుతమైన ట్యూటరింగ్ స్కిల్స్ కూడా ఉన్నాయి.ఈ బాలుడు ప్రస్తుతం లాస్ పొసిటాస్‌లో ఎక్కువగా కోరుకునే ట్యూటర్‌లలో ఒకడిగా నిలుస్తున్నాడు.

STEM సబ్జెక్టులలో ప్రత్యేకత కలిగి ఉన్నాడు.ఈ బాలుడికి స్పేస్ఎక్స్‌ నుంచి అవకాశం రాకముందు చాలా దిగ్గజ కంపెనీల నుంచి భారీ ఆఫర్లు వచ్చాయి.

వాటిని క్వాజీ సింపుల్‌గా రిజెక్ట్ చేశాడు.మొత్తంమీద, కైరాన్ క్వాజీ అసాధారణ నైపుణ్యాలు, చిన్న వయస్సులో సాధించిన విజయాలు అతనికి స్పేస్ఎక్స్‌లో పని చేసే ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని అందించాయి.

తారక్ పేరెత్తడానికి కూడా ఇష్టపడని బాలకృష్ణ.. తమ హీరో అంత తప్పేం చేశాడంటూ?