ఒత్తిడి వల్ల రాత్రుళ్ళు త్వరగా నిద్ర పట్టడం లేదా.. అయితే మీ సమస్యకు ఇదే బెస్ట్ సొల్యూషన్!
TeluguStop.com
ప్రస్తుత టెక్నాలజీ కాలంలో ప్రతి ఒక్కరు బిజీ లైఫ్ స్టైల్ కారణంగా తీవ్ర ఒత్తిడికి( Stress ) లోనవుతున్నారు.
ఒత్తిడి చిన్న సమస్యగానే కనిపించిన అనేక జబ్బులకు దారితీస్తుంది.కొందరికి ఒత్తిడి వల్ల రాత్రుళ్ళు త్వరగా నిద్ర పట్టదు.
మనసు, మెదడు గందరగోళంగా ఉంటాయి.ఇదే రెగ్యులర్ గా కంటిన్యూ అయితే నిద్రలేమికి దారితీస్తుంది.
కాబట్టి అంతవరకు వెళ్లకుండా ముందుగానే సమస్యను పరిష్కరించుకోవాలి.అయితే ఇప్పుడు చెప్పబోయే బెడ్ టైం టీ అందుకు చాలా బాగా సహాయపడుతుంది.
రోజు నైట్ డిన్నర్ తర్వాత ఈ టీను కనుక తీసుకుంటే ఒత్తిడి చిత్తు అవ్వడమే కాకుండా వెంటనే నిద్రలోకి జారుకుంటారు.
మరి ఇంతకీ ఆ టీ ఏంటో.దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో.
తెలుసుకుందాం పదండి. """/" /
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక చిన్న కప్పు వాటర్ ( Cup Of Water )పోసుకోవాలి.
వాటర్ బాగా మరిగిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ సోంపు( Anise ), పావు టీ స్పూన్ జాజికాయ పొడి, పావు టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి( Cinnamon Powder ) వేసి రెండు నిమిషాల పాటు మరిగించాలి.
ఆ తర్వాత అందులో ఒక గ్లాస్ కొవ్వు తీసిన పాలు పోసి ఏడు నుంచి ఎనిమిది నిమిషాల పాటు మరిగించాలి.
చివరిగా వన్ టేబుల్ స్పూన్ తాటి బెల్లం( Palm Jaggery ) తురుము వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన టీ అనేది సిద్ధమవుతుంది.
"""/" /
స్ట్రైనర్ సహాయం తో టీ ని ఫిల్టర్ చేసుకుని గోరువెచ్చగా అయిన అనంతరం సేవించాలి.
రోజు నైట్ ఈ టీ తాగితే ఎలాంటి ఒత్తిడి అయినా సరే దూరం అవుతుంది.
మనసు, మెదడు ప్రశాంతంగా మారతాయి.అలాగే ఈ టీ నిద్ర హార్మోన్ల ఉత్పత్తిని పెంచుతుంది.
పడుకోగానే వెంటనే నిద్రలోకి జారుకునేలా ప్రోత్సహిస్తుంది.మంచి నిద్రను అందిస్తుంది.
అలాగే ఈ టీ అరుగుదలను పెంచుతుంది.గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి జీర్ణ సంబంధిత సమస్యలను అడ్డుకుంటుంది.
రక్తపోటును సైతం అదుపులో ఉంచుతుంది.
బాహుబలి సమయానికి నా వయస్సు అంతే.. బాహుబలి నటి షాకింగ్ కామెంట్స్ వైరల్!