హెయిర్ బ్రేకేజ్ తో ఇక నో వర్రీ.. ఇలా చెక్ పెట్టండి!

హెయిర్ ఫాల్( Hair Fall ) అనేది ఒక పెద్ద సమస్య అయితే.

హెయిర్ బ్రేకేజ్ మరొక పెద్ద సమస్యగా చెప్పుకోవచ్చు.పోషకాహార లోపం, హెయిర్ స్టైలింగ్ టూల్స్ ను అధికంగా వినియోగించడం, బిగుతుగా జడ వేసుకోవడం, వేడి వేడి నీటితో తల స్నానం చేయడం, తడి జుట్టును దువ్వడం, కాలుష్యం, ఒత్తిడి తదితర కారణాల వల్ల హెయిర్ బ్రేకేజ్ బాగా ఇబ్బంది పెడుతుంటుంది.

ఈ సమస్యను ఎలా వదిలించుకోవాలో తెలియక తెగ హైరానా పడుతుంటారు.కానీ ఇకపై నో వర్రీ.

ఇప్పుడు చెప్ప‌బోయే హోమ్ రెమెడీని ప్రయత్నిస్తే చాలా సింపుల్ గా హెయిర్ బ్రేకేజ్ కు చెక్ పెట్టవచ్చు.

"""/" / అందుకోసం ముందుగా ఒక అరటి పండును( Banana Fruit ) తీసుకొని పీల్ తొలగించి స్లైసెస్ గా కట్ చేసుకోవాలి.

ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న అరటి పండు స్లైసెస్, నాలుగు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ అలోవెరా జెల్( Fresh Aloe Vera Gel ), వన్ టీ స్పూన్ ఆముదం( Castor Oil ) వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ తేనె( Honey ), రెండు టేబుల్ స్పూన్లు గడ్డ పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.

"""/" / ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

వారానికి ఒకసారి ఈ బనానా మాస్క్ ను కనుక వేసుకుంటే హెయిర్ బ్రేకేజ్ అన్న మాటే అనరు.

ఈ మాస్క్ జుట్టుకు చక్కని పోషణ అందిస్తుంది.జుట్టును ఆరోగ్యంగా దృఢంగా మారుస్తుంది.

హెయిర్ ఫాల్ మరియు హెయిర్ బ్రేకేజ్ సమస్యలకు అడ్డుకట్ట వేస్తుంది.అంతేకాకుండా ఈ బనానా మాస్క్ జుట్టు ఎదుగుదలను ప్రోత్సహిస్తుంది.

పల్చటి జుట్టును ఒత్తుగా మారుస్తుంది.కురులను సిల్కీ గా షైనీ గా సైతం మెరిపిస్తుంది.

సైన్యంలో మహిళల పట్ల ఇంత నీచమైన ప్రవర్తన ఉంటుందా.. కండోమ్‌తో సైనికురాలి ఇంటికొచ్చిన అధికారి!