కొత్తవారిని కలుస్తున్నారా..? అయితే ఈ 8 టిప్స్‌ పాటించండి.! వారికి మీ మీద మంచి ఇంప్రెషన్‌ కలుగుతుంది.

లవ్‌లో అయినా సరే.ఇతర విషయాల్లో అయినా సరే.

తొలిసారిగా ఒక వ్యక్తిని చూసినప్పుడు మనకు కలిగే ఇంప్రెషనే బెస్ట్‌ ఇంప్రెషన్‌గా ఉండిపోతుంది.

అలాగే మనల్ని ఎవరైనా తొలిసారిగా చూసినప్పుడు కలిగే ఇంప్రెషనే వారిలోనూ ఉండిపోతుంది.అయితే ఇలాంటప్పుడు కొందరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల అవతలి వారితో మంచి సంబంధాలను సుదీర్ఘ కాలంపాటు కొనసాగించలేరు.

కానీ కింద ఇచ్చిన కొన్ని టిప్స్‌ పాటిస్తే దాంతో మీరు అవతలి వారి దృష్టిలో ఫస్ట్‌ ఇంప్రెషన్‌నే బెస్ట్‌ ఇంప్రెషన్‌ అనే ముద్రను వేసుకోగలుగుతారు.

దీంతో మీకు, అవతలి వారికి రిలేషన్‌షిప్‌ బాగుంటుంది.మరి అందుకు పాటించాల్సిన టిప్స్‌ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా.

! 1.కొత్తవారితో పరిచయం అయినప్పుడు వారితో మీరు లిఫ్ట్‌ ఎక్కినప్పుడో లేదంటే మెట్లు ఎక్కినప్పుడో, నడుస్తున్నప్పుడో చిన్నపాటి సంభాషణలను వారితో చేయండి.

కేవలం 4, 5 వాక్యాలతో ఆ సంభాషణను ముగించండి.దీంతో మీపై అవతలి వారికి మంచి ఇంప్రెషన్‌ ఏర్పడుతుంది.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ 2.చిత్రంలో చూపినట్టుగా చివరి బొమ్మలో ఉన్న మాదిరిగా హ్యాండ్‌ షేక్‌ ఇవ్వాలి.

మీ చేయి అవతలి వారి చేయిపై ఉండేలా లేదంటే అవతలి వారి చేయి మీ చేయిపై ఉండేలా హ్యాండ్‌ షేక్‌ ఇవ్వరాదు.

అలా ఇస్తే మీపై వారికి బ్యాడ్‌ ఇంప్రెషన్‌ ఏర్పడుతుంది.కనుక హ్యాండ్‌ షేక్‌ను పర్‌ఫెక్ట్‌గా ఇవ్వాల్సి ఉంటుంది.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ 3.కొత్త వారితో మాట్లాడేటప్పుడు ఎప్పుడూ ఉద్యోగం, వ్యాపారానికి చెందిన విషయాలనే కాక వ్యక్తిగత విషయాలను కూడా చర్చించండి.

మరీ అంత డీప్‌గా వెళ్లాల్సిన పనిలేదు.చూచాయగా డిటెల్స్‌ ను మీరు చెబితే చాలు, దాంతో మీపై వారికి మంచి ఇంప్రెషన్‌ ఏర్పడుతుంది.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ 4.సాధారణంగా చలికాలంలో ఎవరి శరీరం అయినా చల్లగానే ఉంటుంది.

ఈ క్రమంలో హ్యాండ్‌ షేక్‌ ఇస్తే అంత బాగోదు .మరి అప్పటికప్పుడు చేతులు వేడిగా అవ్వాలంటే మంట ఉండదు కదా, అందుకు ఏం చేయాలంటే.

చేతులను బాగా రుద్దుకోవాలి.ఒకదానికేసి ఒకటి రుద్దుకుంటే వేడి పుడుతుంది.

అలా కాకుండా టాయిలెట్లలో ఉండే హాట్‌ డ్రయ్యర్‌ మెషిన్‌ కింద చేతులు పెడితే వేడి గాలి వస్తుంది.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ 5.అదీ వద్దనుకుంటే వేడి కాఫీని మగ్‌ లో పోసుకుని కొంత సేపు మగ్‌ను పట్టుకోండి చాలు, చేతులు వేడిగా అవుతాయి.

ఇక ఆ తరువాత మీరు మీ చేతులతో ఎవరికి హ్యాండ్‌ షేక్‌ ఇచ్చినా ఏమీ కాదు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ 6.మీ తప్పులను ఎవరైనా కొత్త వారు ఎత్తి చూపితే ఫీల్‌ అవకండి.

వారితో మంచి రిలేషన్‌ మెయింటెయిన్‌ చేయండి.మీ తప్పును చెప్పినందుకు వారికి థ్యాంక్స్‌ చెప్పండి.

దీంతో వారికి మీపై మంచి ఇంప్రెషన్‌ ఏర్పడుతుంది. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ 7.

కొత్తవారితో మీటింగ్‌ అయ్యేటప్పుడు అందరికీ తెలిసిన విషయమే అయినా కొంత క్రియేటివిటీతో చెప్పండి.

దీంతో వారికి మీ పట్ల మంచి అభిప్రాయం కలుగుతుంది.అది వారికి, మీకు ఉన్న రిలేషన్‌ను పెంచుతుంది.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ 8.ఇక చివరిగా మరో టిప్‌ ఏమిటంటే… కొత్త వారితో మొదట్లో కొంత కాలం క్రియేటివ్‌గా ఉండండి.

నిజాయితీగా పనిచేయండి.ఆత్మవిశ్వాసంతో వ్యవహరించండి.

దీంతో ఇక వారికి మీపై ఎప్పటికీ అదే అభిప్రాయం కొనసాగుతుంది.

వైరల్ న్యూస్: వాటే టాలెంట్ గురూ.. ఉద్యోగం కోసం కంపెనీకే డబ్బులు ఇస్తానన్న అభ్యర్థి..