శబరిమలకు తీరువాభరణం యాత్ర ఎలా జరిగిందంటే..
TeluguStop.com
భక్త కోటి శరణు ఘోష మధ్య తిరువాభరణా యాత్ర గురువారం మొదలై పండలం లోని దేవాలయం నుంచి ఈ పవిత్ర ఆభరణాలను శాస్త్రోక్తంగా ఊరేగింపుగా తీసుకొచ్చారు.
ఈ ఆభరణాలను పవిత్ర మకరవిళాక్కు సందర్భంగా జనవరి 14న అయ్యప్ప స్వామికి అలంకరించారు.
ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు ప్రతినిధులు పండలం నుంచి వచ్చిన ఆభరణాలను స్వీకరించి భక్తుల దర్శనార్థం కొంత సేపు శాస్త ఆలయంలో ఉంచారు.
ఈ ఆభరణాలను పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుని పూజలు కూడా చేశారు.సాంప్రదాయంగా చేసే పూజాదికాల తర్వాత భక్తుల శరణు ఘోష మధ్య ఈ పవిత్ర ఆభరణాలను చెక్క బాక్సులో పెట్టి శబరిమల తీసుకొని వెళ్లారు.
గత ఆరు దశాబ్దాలుగా నియమ నిష్టలతో ఈ క్రతువును నిర్వహిస్తున్న కులథినాల్ గంగాధరన్ పిళ్లై ఆధ్వర్యంలో ఈ ఆభరణాలను తల పై పెట్టుకుని మూడు రోజుల పాటు నడిచి జనవరి 14 సాయంత్రానికి శబరిమల చేరుకున్నారు.
"""/"/
ఈ ఊరేగింపుకు పండలం రాజా కుటుంబ ప్రతినిధి కత్తి చేత పట్టుకొని రక్షణ కల్పించాల్సి ఉండగా అది సాధ్యం కాలేదు.
ఎందుకంటే ఈ సంవత్సరం పండలం రాజా కుటుంబంలో మరణం సంభవించడం వల్ల రాజా కుటుంబ ప్రతినిధి ఈ ఊరేగింపు లో పాల్గొనడం జరగలేదు.
ఈ పవిత్ర ఊరేగింపున కు కేరళ ప్రభుత్వం భారీ భద్రతను ఏర్పాటు చేసింది.
"""/"/
పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయడంలో సఫలమయ్యారు.ఆ పవిత్ర ఆభరణాలను జనవరి 14న దీపారాధనకు ముందు స్వామివారికి తంత్రి కందరపు రాజీవరరు అలంకరించారు.
అయ్యప్ప స్వామికి ఈ పవిత్ర ఆభరణాలను అలంకరించడం లో తంత్రి కందరపు రాజీవరరుకు మెల్సాంతి సహకరించారు.
క సక్సెస్ తో రేంజ్ పెంచుకున్న కిరణ్ అబ్బవరం.. అలాంటి ప్రాజెక్ట్స్ ఎంచుకుంటారా?