తిరుపతి లడ్డు రేటు పెంపుపై టీటీడీ చైర్మన్ క్లారిటీ

తిరుమలలో శ్రీవారి దర్శనం తరువాత భక్తులంతా హడావుడి పడేది లడ్డూ ప్రసాదం కోసం.

దీనికి ఎంతో ప్రత్యేకత ఉంది.మన బంధువులు, స్నేహితులు గాని ఎవరైనా తిరుమల తిరుపతి వెళ్లి వస్తే, లడ్డూ ప్రసాదం తెచ్చారా అని తప్పకుండా అడుగుతారు.

ఈ ప్రసాదానికి అంతగా ప్రాముఖ్యత ఉంది.అయితే గత కొన్ని రోజుల నుండి తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డు ధర ను పంచబోతోంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొట్టాయి టిటిడి లడ్డూ ధర పెంచి భక్తుల జేబులకు చిల్లు పెట్టబోతోంది అంటూ పెద్ద ఎత్తున విమర్శలు కూడా మొదలయ్యాయి.

దీంతో టిటిడి చైర్మన్ వై వి.సుబ్బారెడ్డి దీనిపై క్లారిటీ ఇచ్చారు.

ప్రస్తుతం తమిళనాడులో పర్యటిస్తున్నవైవీ చెన్నైలో మీడియాతో మాట్లాడార.లడ్డూ ధర ను పెంచే ఉద్దేశ్యం తమకు లేదని, ప్రస్తుతం ఏ విధంగా అయితే లడ్డూలు విక్రమిస్తున్నామో అదేవిధంగా అదే ధరకు ఇస్తామని క్లారిటీ ఇచ్చారు.

ఇప్పటి వరకు ఒక లడ్డు 25 రూపాయలు చొప్పున టీటీడీ విక్రయిస్తోంది.అయితే ఈ ధరను 50 రూపాయలకు పెంచాలని టీటీడీ ముందుగా అనుకుంది.

కానీ దీనిపై భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో తమకు లడ్డు ధరను పెంచే ఉద్దేశమే లేదంటూ ప్రకటించింది.

ఈ టాలీవుడ్ సినిమాలు మలుపు తిరగడానికి కారణమైన పెయింటింగ్స్ !