వీడియో వైరల్: మండుటెండలో ఉడుత దాహం తీర్చిన వ్యక్తి!

ప్రస్తుతం ఇండియాలో ఎండలు మండిపోతున్నాయి.ఈ నేపథ్యంలో ప్రజలు మాత్రమే కాకుండా మూగజీవులు కూడా అల్లాడిపోతున్నాయి.

అయితే వీటి బాధను అర్థం చేసుకున్న కొందరు తమవంతుగా నీటిని అందిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు.

తాజాగా ఒక వ్యక్తి మండుటెండలో మగ్గిపోతూ దాహంతో అల్లాడిపోతున్న ఒక ఉడతని కాపాడాడు.

ఈ వ్యక్తి చెట్టుపై ఉన్న ఉడుత దగ్గరికి చల్లటి నీరుని తీసుకెళ్లి దాని ముందు ఉంచాడు.

నీరు( Water ) చూడగానే ప్రాణం లేచి వచ్చిన ఆ ఉడుత( Squirrel ) నీటిని తాగి దాహం తీర్చుకుంది.

"""/" / ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నందా ట్విట్టర్‌( Twitter )లో కొద్ది గంటల క్రితం పంచుకున్నారు.

ఈ వీడియో షేర్ చేసిన కొంతసేపటికే వైరల్ గా మారింది.ఇందులో ఓ యువకుడు చిన్న వాటర్ బాటిల్‌ పట్టుకుని ఓ చెట్టు వద్దకు వెళ్లడం కనిపించింది.

అదే చెట్టు మీద ఒక చిన్న ఉడుత కూడా ఉండటం గమనించవచ్చు.ఆ తర్వాత అది ఆ యువకుడు చూపించిన బాటిల్‌ను చూసి వెంటనే దాని వైపుగా వచ్చింది.

తర్వాత అతను ఆ బాటిల్‌ను వంచుతూ దానికి నీళ్లు అందేలా చేశాడు.అయితే ఆ ఉడుత చాలా దాహంతో ఉన్నట్టుంది.

అందుకే అది ఇంకా కావాలి అన్నట్లు వాటర్ తాగింది.ఆ విధంగా ఈ చిన్ని ప్రాణి దాహార్తిని అతను తీర్చాడు.

"""/" / అయితే "ఆ ఉడుత ఎంత దాహంతో ఉందో, అందుకే అది మనిషిని చూసి పారిపోకుండా అతని వద్దకు వచ్చి నీరు తాగింది" అని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు.

మనుషుల్లో మానవత్వం ఇంకా మిగిలి ఉందని అతన్ని ఇంకొందరు కొనియాడారు.సోషల్ మీడియాలో పొగడ్తల వర్షం కురిపిస్తే చాలదు, ఇలాంటి మంచి పనులు నిజజీవితంలో కూడా చేయాలని మరి కొందరు తోటి నెటిజనులకు సలహా ఇచ్చారు.

కురులకు కొండంత అండగా ఉండే మెంతులు.. ఇలా వాడితే మీ సమస్యలన్నీ దూరం!