మంచి విషయాల గురించి ఆలోచించు… అన్ని మంచే జరుగుతాయ్… భర్తకు సలహా ఇచ్చిన నయన్!

దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నయనతార(Nayanatara) గత ఏడాది డైరెక్టర్ విగ్నేష్ శివన్(vignesh Shivan) ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఇలా వైవాహిక జీవితంలో ఈ జంట ఎంతో సంతోషంగా ఉన్నారు.ఇక పెళ్లి తర్వాత నయనతార వరుస సినిమాలలో నటిస్తున్నారు.

ఇక విగ్నేష్ సైతం అజిత్ హీరోగా ఓ సినిమా చేయడానికి కమిట్ అయ్యారు.

అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.అయితే తాజాగా ఈయన మరో ప్రాజెక్ట్ కు కమిట్ అయ్యారని తెలుస్తుంది.

"""/" / ఈ క్రమంలోనే నయనతార తన భర్త విగ్నేష్ కి కొన్ని సలహాలు సూచనలు చేస్తూ తనలో ధైర్యాన్ని నింపుతున్నారని తెలుస్తోంది.

తన భార్యతో ముచ్చట్లు పెట్టుకోగా తాను తనకు ఇలా చెప్పిందంటూ విగ్నేష్ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు.

ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.ఇక నయనతార తన భర్తకు ఎలాంటి సలహాలు ఇచ్చారనే విషయానికి వస్తే.

ఎప్పుడు మంచి విషయాలు గురించే ఆలోచించి వాటిపైనే ఫోకస్ పెట్టు అన్ని మంచే జరుగుతాయి అంటూ సలహా ఇచ్చారట అయితే ఈ విషయంపై విగ్నేష్ స్పందిస్తూ.

"""/" / భార్యతో ఇలా మామూలుగా మాట్లాడుతూ ఉంటే తను అలా ఫిలాసఫీలు చెప్పింది.

సరైన వ్యక్తి నుంచి సరైన సమయంలో వచ్చే మాటల ప్రభావం చాలా ఉంటుంది.

వాటిని మనం వినాల్సిందే.అంటూ తన భార్య తనకు ఇచ్చిన సలహా గురించి విగ్నేష్ ఈ సందర్భంగా తెలియజేశారు.

ఇక నయనతార సినిమాల విషయానికొస్తే ఈమె షారుఖ్ ఖాన్ సరసన జవాన్ సినిమాలో( Jawan Movie ) నటించారు.

అయితే కమల్ హాసన్ హీరోగా చేయబోతున్న సినిమాలో నయనతార అవకాశం అందుకుందని వార్తలు వస్తున్నప్పటికీ ఇంకా ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఆ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ చేస్తే బాగుంటుంది.. బాలకృష్ణ కామెంట్స్ వైరల్!