జుట్టుకు కలర్ వేస్తున్నారా.. అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

జుట్టుకు కలరింగ్ చేసుకోవడం అనేది ప్రస్తుత రోజుల్లో చాలా కామన్ అయిపోయింది.కొందరు తెల్ల జుట్టును కవర్ చేసుకునేందుకు కలర్ వేసుకుంటే.

మరి కొందరు ట్రెండ్ పేరుతో కురులకు రకరకాల రంగులను అద్దుతున్నారు.అయితే కలర్ వేసుకునేవారు కచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి.

జుట్టు కోసం రంగు కొనేటప్పుడు అమ్మోనియా, సల్ఫేట్ ఫ్రీ( Ammonia , Sulfate Free ).

కలర్ సేఫ్ రకాలను కొనుగోలు చేయాలి.ఎందుకంటే రంగుల్లో వాడే కెమికల్స్ వల్ల అలర్జీలు వచ్చే అవకాశాలు ఎక్కువ.

చర్మ సంబంధిత సమస్యలు, జుట్టు కుదుళ్ల బలహీన పడటం, విపరీతమైన తలనొప్పి తదితర ప్రాబ్లమ్స్ కూడా తలెత్తుతాయి.

అలాగే జుట్టుకు రంగు వేసుకునే ముందు చెవి వెన‌క‌ కొంచెం అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు ఉంచాలి.

ఈ విధంగా ప్యాచ్ టెస్ట్ చేసినప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకపోతే అప్పుడు హెయిర్ కి అప్లై చేయాలి.

హెయిర్ క‌ల‌రింగ్ చేసుకోవ‌డానికి ముందు ముఖానికి మాయిశ్చరైజర్( Moisturizer ) లేదా నూనె రాసుకోండి.

ఇలా చేస్తే ముఖానికి రంగు అంటిన కూడా త్వరగా వదిలిపోతుంది. """/" / జుట్టుకు రంగు వేసిన తర్వాత మొదటిసారి షాంపూ చేయడానికి కనీసం 24 గంటలు లేదా 48 గంటలు వేచి ఉండాలి.

అప్పుడే జుట్టు కుదుళ్లకు రంగు పట్టుకుంటుంది.అలాగే హెయిర్ కలర్ చేయించుకున్న వారు రెగ్యులర్ గా తల స్నానం చేయకూడదు.

ఎందుకంటే బాత్ వాటర్ లో ఉండే క్లోరిన్( Chlorine ) మరియు కాల్షియం ( Calcium )వంటి ఖనిజాలు తలపై చేరినప్పుడు అవి రంగులోని రసాయనాలతో చర్య జరిపి హెయిర్ ను విచిత్రమైన రంగుల్లోకి మార్చేస్తాయి.

"""/" / ఇక‌ కలర్ వేసుకోవడానికి మూడు రోజులు ముందు జుట్టుకు నాణ్యమైన కండీషనర్ పెట్టి తల స్నానం చేయండి.

ఇలా చేయడం వల్ల జుట్టుకు రంగు బాగా పట్టుకుని అందంగా మెరుస్తుంది.జుట్టుకు కలరింగ్ చేసుకున్న తర్వాత వేడి వేడి నీటితో తల స్నానం చేయకూడదు.

అలా చేస్తే రంగు వేసుకున్న ఫలితం ఉండదు.రంగు త్వరగా పోతుంది.

కాబట్టి గోరువెచ్చని నీటితోనే హెయిర్ వాష్ చేసుకోవాలి.

పుష్ప 2 పై అంబటి కామెంట్స్ .. వారిని అరెస్ట్ చేయకపోవడంపై ఫైర్