Upasana : క్లీంకారని చూడాలంటే ఇన్ని కండిషన్‌లా.. టూ మచ్ చేస్తున్న మెగా ఫ్యామిలీ..!

మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్( Ram Charan ) ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు.

ఆ సినిమా ఆస్కార్ పురస్కారం కూడా పొందింది.ఇదే సమయంలో చరణ్ సతీమణి ఉపాసన గర్భం దాల్చడం రామ్ చరణ్‌కి మరింత సంతోషాన్నిచ్చింది.

అప్పటినుంచి చెర్రీ తన భార్యను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వస్తున్నాడు.ఇటీవలే ఉపాసన ఒక పండంటి ఆడ బిడ్డకు కూడా జన్మనిచ్చింది.

ఆ సమయంలో మెగా వారసురాలు వచ్చిందంటూ వార్తలు హల్చల్ చేశాయి.అపోలో హాస్పిటల్ ముందు రామ్ చరణ్ బిడ్డను ఫొటో తీసుకునేందుకు వందల సంఖ్యలో మీడియా పర్సన్స్ పడిగాపులు కాయడం కూడా అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది.

""img / పుట్టుకతోనే సెన్సేషనల్‌గా మారిన చెర్రీ బేబీ గర్ల్ పేరు పెట్టుకున్న తర్వాత కూడా వార్తల్లో నిలిచింది.

ఈ చిన్నారికి చాలా ప్రత్యేకంగా క్లీంకార( Klim Kara )అని మెగా ఫ్యామిలీ నామకరణం చేసింది.

నిజానికి ఈ పేరుని ఉపాసనకు పెట్టాలనుకున్నారట.కానీ అది కుదరక ఆమె బిడ్డకు పెట్టారు.

దాదాపు 11 ఏళ్ల తర్వాత చరణ్ వారసురాలు పుట్టడంతో ఆమెను చూసేందుకు బంధుమిత్రులు తరలివస్తున్నారు.

వారితోపాటు స్టార్ సెలబ్రిటీలు కూడా మెగా ఇంటికి క్యూ కడుతున్నారు. """/" / అయితే పుట్టగానే స్టార్ సెలబ్రిటీ అయిపోయిన క్లీంకారని చూడడానికి బడా సెలబ్రిటీలు కూడా కొన్ని కండిషన్స్ ఫాలో అవ్వాల్సి వస్తుందట.

ఇప్పుడే పుట్టిన పాప అని, ఆమె వద్దకు సెల్ ఫోన్స్ తీసుకొస్తే ఆరోగ్యానికి హాని జరుగుతుందని, ఉపాసన విజిటర్స్‌కి( Upasana ) ఫోన్లు తీసుకురావద్దని కండిషన్లు పెట్టిందట.

అది చాలాదన్నట్టు క్లీంకారని ఎవరూ టచ్ చేయకూడదని మరో కండిషన్ కూడా పెట్టిందట.

ఇదే కాకుండా పాపకి దిష్టి తగులుతుందేమోనని ఎక్కువమందికి ఆమెను చూపించట్లేదట.బంధువులను కూడా తిరిగి పంపిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

చిన్న పాపకి ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం కూడా ఉందని ఆమెను ఒక స్పెషల్ రూమ్ లో ఉంచి జాగ్రత్తగా తీసుకుంటున్నారని సమాచారం.

మొత్తం మీద ఈ కండిషన్స్ గురించి తెలుసుకొని అందరూ నోరెళ్లబెడుతున్నారు.

అల్లు అర్జున్ తో తనని తాను పోల్చుకున్న పల్లవి ప్రశాంత్… కాస్త ఓవర్ అయిందంటూ?