బొడ్డుని శుభ్రం చేసుకోవడం మరిచిపోతున్నారా?అయితే మీరే స్వయంగా మీ ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నారు.!
TeluguStop.com
నిత్యం వ్యాయామం, తగిన సమయానికి భోజనం చేయడం, పౌష్టికాహారం తీసుకోవడం మన శరీరానికి ఎంత అవసరమో, దాన్ని శుభ్రంగా ఉంచుకోవడం కూడా అవసరమే.
లేదంటే ఎన్నో రకాల అనారోగ్యాలు వ్యాపించే అవకాశం ఉంటుంది.శరీరం మొత్తం శుభ్రంగా ఉంటేనే ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.
అయితే నిత్యం స్నానం చేస్తూ దేహాన్ని శుభ్రం చేసుకుంటున్నా అధిక శాతం మంది మరిచిపోయే భాగం ఒకటుంది.
అదే బొడ్డు.అవునండీ, బొడ్డుని శుభ్రం చేసుకోవడం చాలా మంది మర్చిపోతుంటారు.
మన శరీరం మధ్య భాగంలో ఉండే నాభి.చాలా మంది స్నానమైతే చేస్తారు కానీ బొడ్డును సరిగ్గా శుభ్రం చేసుకోరు.
దీంతో ఆ ప్రాంతంలో బాక్టీరియా పేరుకుపోయి వివిధ రకాల వ్యాధులు వస్తుంటాయి.సైంటిస్టులు చెబుతున్నదేంటంటే బొడ్డులో దాదాపు 67 రకాల బాక్టీరియాలు నివాసం ఉంటాయట.
ఈ క్రమంలో బొడ్డును సరిగ్గా శుభ్రం చేసుకోకపోతే వ్యాధుల బారిన పడక తప్పదని వారు హెచ్చరిస్తున్నారు.