సలార్ లో ఈ పవర్ఫుల్ లేడీ పవర్ఫుల్ రోల్.. ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
TeluguStop.com
ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ( Prabhas )చేస్తున్న సినిమాల్లో భారీ క్రేజ్ ఉన్న పాన్ ఇండియన్ మూవీ ''సలార్''( Salaar Movie ).
కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్( Prashanth Neel ) తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ అయ్యింది.
దాదాపు సగానికి పైగానే షూట్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమాను నీల్ హై వోల్టేజ్ యాక్షన్ కథాంశంతో తెరకెక్కిస్తున్నాడు.వీరి కాంబోలో ఏ రేంజ్ లో యాక్షన్ బ్లాక్ బస్టర్ తెరకెక్కుతుందో అని డార్లింగ్ ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.
సెప్టెంబర్ 28న రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేసారు.ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి ఇప్పుడొక అదిరిపోయే వార్త వైరల్ అయ్యింది.
ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ రోల్ ఉందట.ఆ పవర్ఫుల్ రోల్ లో ఒక పవర్ఫుల్ లేడీ నటిస్తున్నట్టు కన్ఫర్మ్ అయ్యింది.
"""/" /
ఆమె ఎవరో తెలుసా.శ్రీయ రెడ్డి( Sriya Reddy ).
ఈమె పేరు చెప్పడం కంటే విశాల్ హీరోగా నటించిన పొగరు సినిమాలో నెగిటివ్ రోల్ లో మెప్పించిన బ్యూటీనే శ్రీయ రెడ్డి.
ఈ సినిమా ఇప్పటికి ఆడియెన్స్ కు బాగా గుర్తు ఉంది.ఈ భామ గత కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటుంది.
అయితే సలార్ సినిమాలో ఈమె నటిస్తున్నట్టు ఆమె సోషల్ మీడియా వేదికగా పిక్ షేర్ చేసి కన్ఫర్మ్ చేసేసింది.
"""/" /
నీల్ ఈ పాత్ర కోసం శ్రీయ రెడ్డి అయితేనే బాగా సరిపోతుంది అని భావించి ఆమెను సంప్రదించి ఓకే చేయించారట.
తాజాగా ఈమె డైరెక్టర్ నీల్, డీఓపీ భువన్ తో కలిసి దిగిన పిక్ షేర్ చేస్తూ ఈ సినిమాలో భాగం అయినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది.
ఇక ఈ సినిమాలో తన పాత్ర ముగిసినట్టు తెలుస్తుంది.మరి నీల్ ఈమె కోసం ఎంత పవర్ఫుల్ గా క్యారెక్టర్ ను క్రియేట్ చేసాడో చూడాలి.
కాగా ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.
కెజిఎఫ్ సినిమాను నిర్మించిన హోంబలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఇక ఈ సినిమాకు రవి బసృర్ సంగీతం అందిస్తుండగా ఈ సినిమా సెప్టెంబర్ 28న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది.
పైనాపిల్ ఆరోగ్యాన్నే కాదు జుట్టును కూడా ఒత్తుగా పెంచుతుంది.. ఎలా వాడాలంటే?