పోలీస్ స్టేషన్ లో డబ్బులు కాజేసిన దొంగలు..!!
TeluguStop.com
ప్రస్తుత రోజులు ఉన్న కొద్ది ప్రమాదకరంగా మారిపోతున్నాయి.ప్రజలను కాపాడాల్సిన పోలీసుల స్టేషన్లలో కూడా దొంగతనాలు జరిగే పరిస్థితి కనిపిస్తున్నాయి.
సరిగ్గా ఇటువంటి సంఘటన పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం పోలీస్ స్టేషన్ లో జరిగింది.
మేటర్ లోకి వెళ్తే ఇటీవల ప్రభుత్వం మద్యం దుకాణాల్లో వచ్చిన ఆదాయాన్ని సూపర్ వైజర్ లు ఏ రోజుకారోజు ఆదాయాన్ని బ్యాంకులో డిపాజిట్ చేస్తారు.
అయితే ఇటీవల నాలుగు రోజులు బ్యాంకులకు సెలవులు ప్రకటించడంతో వచ్చిన ఆదాయాన్ని ఎవరి దగ్గర దాచకుండా నాలుగు మద్యం షాపుల సూపర్ వైజర్ లు వీరవాసరం పోలీస్ స్టేషన్ లో ఒక బాక్స్ లో సుమారు 8 లక్షల 4 వేల 330 రూపాయలు పెట్టి పోలీసులకు అప్పగించారు.
అయితే ఇటీవల బ్యాంకులు తెరవడంతో సూపర్ వైజర్ లు స్టేషన్ లో దాచిన డబ్బును బ్యాంకులో డిపాజిట్ చేయడానికి వెళ్లగా బాక్స్ లో డబ్బులు లేక పోవడంతో పాటు బాక్స్ కి వేసిన తాళం వేసినట్టుగానే ఉండటంతో సూపర్ వైజర్ లు కి మతి పోయింది.
డబ్బు పోవటంతో లబోదిబోమంటున్నారు.కేసు ఎవరి మీద పెట్టాలి ఉన్న దాని విషయంలో అర్థంకాని పరిస్థితిలో ఉన్నారు.
ఇలాంటి తరుణంలో అసలు అందులో డబ్బులు పెట్టారా లేదా అన్నదానిపై పోలీసులు దర్యాప్తు స్టార్ట్ చేశారు.
ఇదే తరుణంలో అసలు పోలీస్ స్టేషన్ లో ఇంటి దొంగలు ఏమైనా ఉన్నారా అన్నదానిపై కూడా అనుమానం వ్యక్తం చేస్తూ ఆ దిశగా కూడా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదిలా ఉంటే పోలీస్ స్టేషన్ లోనే డబ్బులు పోవటంతో జిల్లా కి చెందిన పోలీసు ఉన్నతాధికారులు ఈ ఘటనపై సీరియస్ అయ్యారు.
నిందితులను త్వరగా పట్టుకోవాలని బాధ్యతారహితంగా వ్యవహరిస్తే కోరుకునేది లేదు అంటూ దర్యాప్తు చేస్తున్న పోలీసులకు కీలక ఆదేశాలు ఇచ్చారు.
కల్తీ నెయ్యిని గుర్తించేందుకు ఈ సింపుల్ టిప్స్ ను ఫాలో అవ్వండి..!