మంత్రుల ప‌ర్యట‌న‌లో రెచ్చిపోయిన దొంగ‌లు.. ఏకంగా జ‌డ్పీటీసీ భ‌ర్త జేబులోంచే..

దొంగ‌ల‌ను మించిన తెలివి మ‌రెవ‌రికీ ఉండ‌దేమో అనిపిస్తుంది కొన్ని వీడియోలు చూస్తుంటే.ఎందుకంటే ర‌ద్దీగా ఉన్న జ‌నాల‌ల్ఓ కూడా వారు చాలా ఈజీగా జేబులు, ప‌ర్సులు కొట్టేస్తుంటారు.

ఇక ఇప్పుడు కూడా ఈజీగానే ఓ దొంగ త‌న చేతివాటం చూపించేస్తున్నాడు.అయితే ఈ దొంగ‌కు కొంత ధైర్యం ఎక్కువే అని చెప్పాలి.

ఎందుకంటే ఏకంగా మంత్ర‌లు ప‌ర్య‌ట‌న‌లో పోలీసులు చూస్తుండ‌గానే ప్ర‌జాప్ర‌తినిధుల జేబుల్లోంచి ప‌ర్సులు కొట్టేస్తున్నాడంటే ప‌రిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.

కాగా వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.ఇప్పుడు యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలో మంత్రుల పర్యటిస్తున్న సంద‌ర్భంగా ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

ఇక మంత్రులు వ‌స్తున్నారంటే స్థానికంగా ఉండే నాయ‌కులు క‌చ్చితంగా వ‌స్తుంటారు.ఇక ఇదే అదునుగా భావించిన ఆ దొంగ‌లు భారీగా డబ్బు కాజేశారు.

ఏకంగా అధికార పార్టీ అయిన టీఆర్ ఎస్ ప్రజా ప్రతినిధులు అలాగే టీఆర్ఎస్ నేతలకు ఆ దొంగ‌లు పెద్ద షాక్ ఇచ్చేశారు.

ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా రూ.4 లక్షల కొట్టేశారు.

విష‌యం ఏంటంటే మోత్కూర్ లో నిన్న అన‌గా శ‌నివారం వ్వవసాయ మార్కెట్ కమిటీ కొత్త క‌మిటీ ప్రమాణస్వీకారం సంద‌ర్భంగా మంతులు నిరంజన్ రెడ్డి అలాగే స్థానిక మంత్రి జగదీశ్ రెడ్డి లాంటి వారు హాజ‌ర‌య్యారు.

ఇక మంత్ర‌లు ఎమ్మెల్యేలు పట్టణానికి రాగానే స్థానిక నాయకులు అలాగే కార్యకర్తలు వారికి స్వాగ‌తం చెప్పేందుకు వ‌చ్చారు.

ఇంకేముంది జ‌నాలు విప‌రాతంగా కిక్కిరిసి పోయి ఉన్నారు.ఇక దొరికిందే ఛాన్స్ అనుకుని దొంగలు మోత్కూర్ జెడ్పీటీసీ భర్త అయిన సంతోష్ రెడ్డికి ద‌గ్గ‌ర‌గా వ‌చ్చి కెమెరాలు చూస్తుండ‌గానే ఆయ‌న జేబులోంచి దాదాపుగా రూ.

40 వేలు నొక్కేశారు.ఇక కొత్త మార్కెట్ వైస్ చైర్మన్ అయిన శ్రీనివాస్ ద‌గ్గ‌ర రూ.

37 వేలు చాలా చాక‌చ‌క్యంగా వారి ప‌ర్సులు కొట్టేసిన‌ట్టు వారు వాపోతున్నారు.ఇంకా కొంద‌రు ధ‌నిక రైతుల ద‌గ్గ‌ర నుంచి కూడా బ‌బాగానే కొట్టేశారంట‌.

నాగార్జున 100 వ సినిమా మీద ఫోకస్ పెడితే మంచిదని ఫ్యాన్స్ కోరుతున్నారా..?