కృష్ణాజిల్లా బందరులో దారుణం.. వైద్యురాలిని దారుణంగా హత్య చేసిన దోపిడీ దొంగలు..!
TeluguStop.com
గతంలో దోపిడీ దొంగలు( Thieves ) అంటే ఇంటికి తాళం వేసి ఉంటేనే కన్నం వేస్తారు.
ప్రస్తుతం రోజులు మారాయి కదా.ఇంట్లో డబ్బు, నగలు ఉన్నాయని తెలిస్తే చాలు ఇంటి లోపలికి ప్రవేశించి ఇంట్లో ఉన్న వ్యక్తులను అత్యంత దారుణంగా హత్యలు చేసి దోపిడీ చేసేస్తున్నారు.
ఇలాంటి కోవలోనే ఒక వైద్యురాలి( Doctor ) ఇంటి లోపలికి ప్రవేశించి ఆమెపై విచక్షణారహితంగా దాడి చేసి, హత్య చేసి ఇంట్లో ఉండే నగలు డబ్బుతో పరారైన ఘటన ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా( Krishna District ) బందరులో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది.
అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.వివరాల్లోకెళితే.
బందరు లోని జావారుపేటలో లోక్నాథ్ అలియాస్ మహేశ్వరరావు, రాధా దంపతులు నివాసం ఉంటున్నారు.
వీరిద్దరూ వృత్తి రీత్యా చిన్నపిల్లల వైద్యులుగా కొనసాగుతున్నారు.ఇంటి పై పోర్షన్ లో దంపతులు నివాసం ఉంటూ, కింది పోర్షన్ లో క్లినిక్ నిర్వహిస్తున్నారు.
"""/" /
మంగళవారం రాత్రి మహేశ్వరరావు( Maheshwara Rao ) క్లినిక్ లో ఉండగా.
ఇంట్లో రాధ( Radha ) ఒక్కటే ఒంటరిగా ఉంది.రాత్రి 11 గంటల సమయంలో క్లినిక్ లో నుంచి మహేశ్వరరావు ఎన్ని సార్లు ఫోన్ చేసినా రాధా ఫోన్ తీయకపోవడంతో వెంటనే మహేశ్వరరావు ఇంటి లోపలికి వెళ్లి చూస్తే భార్య రాదా రక్తపు మడుగులో సజీవంగా పడి ఉంది.
వెంటనే మహేశ్వరరావు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బందరు డీఎస్పీ మాధవరెడ్డి, ఇనగుదురుపేట ఉమా మహేశ్వరరావు వెంటనే క్లూస్ టీం తో ఘటనా స్థలానికి చేరుకున్నారు.
"""/" /
సంఘటన స్థలాన్ని పరిశీలించి భర్త నుండి వివరాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసుల ప్రాథమిక విచారణలో దోపిడీ దొంగలు ఇంటి లోపలికి ప్రవేశించి రాధ కళ్ళల్లో కారం చల్లి, ఇనుపరాడ్లతో దాడి చేసి, అనంతరం ఆమె గొంతు కోసి హత్య చేశారు.
ఆ తర్వాత రాధ ఒంటిపై నగలు ఇంట్లో ఉండే నగలు, నగదును ఎత్తుకొని పారిపోయినట్లు నిర్ధారణ అయింది.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బందరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Validation Check 2026-03-23 08:00:35