తుంగతుర్తిలో దొంగల బీభత్సం…రూ.5 లక్షలు చోరీ

సూర్యాపేట జిల్లా: తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం పొద్దుగాల దొంగల రెచ్చిపోయారు.మెయిన్ రోడ్డుపై ఓ ఇంట్లోకి చొరబడి బీరువా తాళాలు పగులగొట్టి అందులోని రూ.

5 లక్షల నగదును అపహరించారు.బాధితుడు శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేయగా తుంగతుర్తి సీఐ శీను నాయక్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించి,కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు,త్వరలోనే ఈ కేసును ఛేదించి, నిందితులను పట్టుకుంటామని తెలిపారు.

బాధితుడు శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో ఓ స్థలం కొనుగోలు చేశామని,దానికి డబ్బులు కట్టడానికి ఆరు లక్షల రూపాయలు తీసుకొచ్చి ఇంట్లో బీరువాలో పెట్టి తాళం వేసి పనుల నిమిత్తం పొద్దున్నే హోటల్ కి వెళ్లామని, ఉదయం 8 గంటల ప్రాంతంలో మా కుమారుడు ఇంటికి వెళ్లి చూడగా తాళాలు పగలగొట్టి బీరువా తీసి ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ .. ఆ నలుగురు ఎవరు