ఆసుపత్రిలో దొంగలు.. ఖంగుతిన్న వైద్యులు

ప్రభుత్వ ఆసుపత్రిలో అరకొర వసతులతో రోగులు, వారి బంధువులు పడే అవస్థలు ఎలా ఉంటాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.

కానీ నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఓ ఘటన మాత్రం అందులో పనిచేస్తున్న వైద్యులకు నిద్రలేకుండా చేస్తోంది.

ఎందుకంటే అక్కడ వారికి సంబంధించిన వస్తువులను దొంగలు ఎత్తుకెళ్తున్నారట.ఈ ఘటన నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

ఆసుపత్రిలో 25 సీసీ కెమెరాలు, 20 మంది సెక్యురిటీ ఉన్నా కూడా దొంగలు పడి వైద్యవిద్యార్ధుల నగలు, సెల్‌ఫోన్లు ఎత్తుకెళ్లారు.

ఇది గమనించిన వైద్య విద్యార్ధినులు వారి వెంట పడ్డా ఫలితం లేకుండా పోయింది.

వారు ఆసుపత్రి వెనకభాగంలో ఉన్న ప్రహరీ గోడ దూకి పారిపోయినట్లు సీసీ ఫుటేజీల్లో స్పష్టంగా కనిపించింది.

గతకొంత కాలంగా ఆసుపత్రిలో దొంగల బెడద ఎక్కువైందని వారు సూపరిండెంట్‌కు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.

వైద్య విద్యార్ధుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దొంగల కోసం గాలిస్తున్నారు.

సీసీ ఫుటేజీ ఆధారంగా వారిని పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.ఏదేమైనా ప్రభుత్వ ఆసుపత్రిలో వసతులే కాదు రక్షణ కూడా కరువైందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పవిత్ర లోకేశ్ వచ్చిన తర్వాత నా లైఫ్ అలా ఉంది.. నరేష్ సంచలన వ్యాఖ్యలు వైరల్!