కిష్టంపల్లి లో దొంగతనానికి ప్రయత్నించి విఫలమైన దొంగలు

రాజన్న సిరిసిల్ల జిల్లా ( Rajanna Sirisilla District )ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కిష్టం పల్లి లో, కిషన్ దాస్ పేట లో దొంగలు చోరీ చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యారు.

కిష్టంపల్లి లో మొగుళ్ళ మల్లేష్ యాదవ్( Mallesh Yadav ) ఇంట్లోకి చొరబడ్డ దొంగలు ఇంటి తాళం పగల గొట్టి లోపలికి చొరబడి బీరువా పగలగొట్టి బీరువా హ్యాండిల్ ను రోకలి బండ తో పగులగొట్టారు.

దొంగలు వెళ్తూ వెళ్తూ రోకలి బండ ను కడిగి వంట గదిలో ఉంచి వెళ్ళారు.

మల్లేశం భార్య అనిత పుట్టిన రోజు వేడుకలకు వేరే ఊరికి వెళ్ళింది.చోరీ జరిగిన విషయం తెలుసుకున్న స్థానిక మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్ మల్లేష్ యాదవ్ ఇంటికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు.

అదే విధంగా కిషన్ దాస్ పేట లో ఇంటి బయట ఉంచిన ఎర్రవెళ్లి కృష్ణ కు చెందిన ద్విచక్ర వాహనం ఎత్తుకెళ్లగా పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు.

స్థానిక ఎస్.ఐ రమాకాంత్ ఆధ్వర్యంలో పోలీసులు చోరీ జరిగిన వారి ఇండ్లకు వెళ్లి వివరాలు సేకరించారు.

రాత్రి పూట గస్తీ పెంచాలని గ్రామ ప్రజలు పోలీసులను కోరుతున్నారు.

ఈ ప్రశ్నలకు సమాధానాలేవి బన్నీ.. మూవీ చూడాలంటే అలా చేయడం సాధ్యం కాదా?