ఒకేసారి ముగ్గురు ఎన్నారైల ఇళ్లలో పడ్డ దొంగలు.. మొత్తం ఎంత కాజేసారంటే…

ఇటీవల కాలంలో ఎన్నారైల ఇళ్లను దొంగలు ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు.వారి ఇళ్లలో ఎక్కువ క్యాష్ దొరుకుతుందని ఈ కేటుగాళ్లు పక్కా ప్లాన్ ప్రకారం దొంగతనాలు చేస్తున్నారు.

రీసెంట్‌గా ఒకేరోజు ముగ్గురు ఎన్నారైల ఇళ్లలో దొంగలు పడ్డారు.వారు లక్షల రూపాయలు కాజేశారు.

"""/" / వివరాల్లోకి వెళితే, జులై 26వ తేదీ రాత్రి సమయంలో ఫగ్వారా సమీపంలోని నారంగ్ షాపూర్( Narang Shahpur ) అనే గ్రామంలో ఎన్నారైల రెండు ఇళ్లపై దాడి జరిగింది.

కొందరు దొంగలు ఈ ఇళ్లలోకి చాకచక్యంగా ప్రవేశించి విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు.మొదటి ఇంట్లో రూ.

2 లక్షల క్యాష్, 1500 అమెరికన్ డాలర్లతోపాటు 16 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు.

రెండో ఇంట్లో గోడ దూకి దొంగలు ప్రవేశించారు.10 తులాల బంగారు ఆభరణాలు, 1500 అమెరికన్ డాలర్లు, రూ.

25 వేల నగదు తీసుకున్నారు.భానోకి అనే గ్రామంలోని మరో ఇంట్లో కూడా వస్తువులు చోరీకి గురయ్యాయి.

ఆ ఇంట్లో నుంచి రూ.18 వేల నగదు, బంగారు ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు.

మొత్తంగా చోరీకి గురైన వాటి విలువ దాదాపు రూ.22 లక్షలు( Rs.

22 Lakhs ) ఉంటుందని అంచనా.అందులో సుమారు 26 తులాల బంగారు ఆభరణాలు, 3,000 అమెరికన్ డాలర్లు, రూ.

2,25,000 నగదు ఉన్నాయి. """/" / ఫగ్వారా సమీపంలోని నారంగ్ షాపూర్ గ్రామంలో ఎన్నారైలు ఇళ్ల చోరీల గురించి మిగతా ఎన్నారైలు( NRI ) ఆందోళన చెందుతున్నారు.

ఎన్నారైలకు ఆ ప్రాంతంలో లేదా మరేదైనా ప్రదేశంలో ఇళ్లు ఉంటే అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరంగా మారింది.

ఇంటి తలుపులు, కిటికీలకు బలమైన డోర్స్, సెక్యూరిటీ కెమెరాలు, అలారం సిస్టమ్, స్ట్రాంగ్ లాకర్స్ వంటివి ఏర్పాటు చేసుకోవడం మంచిది.

ఇంట్లో ఉండనప్పుడు సెక్యూరిటీ గార్డ్స్‌ను నియమించుకోవడం ఒక తెలివైన పని.

స్టార్ హీరోతో సినిమా ప్లాన్ చేస్తున్న కొరటాల శివ