దేవుడా.. నన్ను క్షమించు.. ప్రార్థించి మరీ హుండీ మాయం చేసిన దొంగ!
TeluguStop.com
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగింది.సోషల్ మీడియాలో కొన్ని ఫన్నీ వీడియోలు వైరల్ అవుతుంటాయి.
ఈ వీడియోలు చూసినప్పుడు చాలా నవ్వుకుంటాం.దొంగలు చాలా సీరియస్‌గా దొంగతనం చేయడం చూస్తుంటాం.
కొందరు కడుపు కోసం తప్పక దొంగతనం చేస్తే.మరికొందరు అత్యాశ కోసం చేస్తుంటారు.
అయితే కొందరు దొంగలు చేసే దొంగతనం ఎంతో ఫన్నీగా అనిపిస్తోంది.ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అందరూ ఫన్నీగా నవ్వుకుంటున్నారు.
అయితే చాలా మంది దొంగలు రాత్రివేళల్లో దొంగతనం చేయడం చూస్తుంటారు.మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఓ హుండీ మాయం అయింది.
సీసీటీవీ ఫుటేజీలో దీనికి సంబంధించిన విజువల్స్ వైరల్ అవుతున్నాయి.ఈ దొంగ ఎంతో ప్రత్యేకంగా దొంగతనం చేశాడు.
దేవుడా.నన్ను క్షమించు అని ప్రార్థించి.
హుండీని ఎత్తుకెళ్లాడు.జబల్‌పూర్ గౌర్ చౌకిలో ఉన్న ఆంజనేయస్వామి విగ్రహం ఉంది.
సోమవారం తెల్లవారుజామున 2 గంటలకు ఓ దొంగ కారులో వచ్చాడు.దీపావళి పండుగ సందర్భంగా అందరూ బిజీగా ఉంటారు.
ఆ సమయంలోనే దొంగ తన చేతివాటాన్ని చూపించాడు.అయితే తెల్లవారుజామున ఓ భక్తుడు ఆలయానికి వెళ్లగా చోరీ జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది.
"""/"/
దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు.సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించగా.
ఓ వ్యక్తి ఆలయంలో ప్రవేశించిన విజువల్స్ కనిపించాయి.ఓ వ్యక్తి కారులో ఆలయానికి వచ్చాడు.
ఆలయం ముందు చెప్పులు వదిలి.లోపలికి ప్రవేశించాడు.
అతడి చేతికి వాచ్ కూడా ఉంది.దేవుడిని ప్రార్థించి.
హుండీ దొంగలించాడు.అయితే ఇలాంటి ఘటనే ఆగస్టు నెలలో కూడా చోటు చేసుకుంది.
ఈ దొంగనే మరోసారి దొంగతనం చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.కాగా, దీనికి సంబంధించిన విజులవ్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
వీడియో చూసిన ప్రతిఒక్కరూ ఫన్నీగా నవ్వుకుంటున్నారు.
కాఫీ డార్క్ సర్కిల్స్ ను పొగొడుతుందా?