వైరల్: భలే దొంగ… సినిమా ఛేజింగులు కూడా పనికిరావు!

వైరల్: భలే దొంగ… సినిమా ఛేజింగులు కూడా పనికిరావు!

నేటి సోషల్ మీడియా ప్రపంచంలో ఎక్కడ ఎటువంటి ఆసక్తికరమైన సంఘటన జరిగినా మనకు ఇట్టే తెలిసిపోతుంది.

వైరల్: భలే దొంగ… సినిమా ఛేజింగులు కూడా పనికిరావు!

ఈ క్రమంలో కొన్ని వీడియోలు ఆసక్తికరంగా అనిపిస్తే మరికొన్ని ఎబ్బెట్టుగా అనిపిస్తాయి.కొన్ని హాస్యాన్ని తెప్పిస్తే, మరికొన్ని చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.

వైరల్: భలే దొంగ… సినిమా ఛేజింగులు కూడా పనికిరావు!

ప్రస్తుతం ఆ రకానికి చెందిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

అవును, సాధారణంగా పోలీసులు ఓ దొంగను( Thief ) పట్టుకోవడానికి వచ్చినప్పుడు వారు తెలివిగా పారిపోయేందుకు ట్రై చేసి, మరలా ఎక్కడో ఒకచోట పప్పులో కలిసి అడ్డంగా దొరికిపోవడం తెలిసిందే.

ఇటువంటి సంఘటనలు మనకు ఎక్కువగా సినిమాలలో కూడా కనిపిస్తాయి.మరికొందరు మాత్రం పోలీసుల కళ్లు గప్పి ఎలాగైనా తప్పించుకోవాలని విచిత్రంగా ఆలోచిస్తారు.

అయితే, చాలా సార్లు అవి బెడిసికొడతాయి. """/" / ఇక్కడ కూడా అదే జరిగింది.

తాజాగా అమెరికాలో( America ) జరిగిన ఈ ఘటన ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పోలీసుల నుంచి తప్పించుకోవాలని ట్రై చేసి చిమ్నీ గొట్టంలో( Chimney ) ఇరుక్కుపోయాడు సదరు దొంగ.

చివరికి పోలీసులే అతడిని కాపాడి జైలుకు తరలించడంతో కధ కంచికి చేరింది.విషయం ఏమిటంటే.

అమెరికాలోని ఫాల్ రివర్ మసాచుసెట్స్( Massachusetts ) ప్రాంతంలో 33 ఏళ్ల రాబర్ట్ లాంగ్లాయిస్‌తో పాటు మరికొందరు తమ ఇళ్లలో డ్రగ్స్ నిల్వ చేసి సరఫరా చేస్తున్నారు.

ఈ విషయాన్ని తెలుసుకున్న అక్కడి పోలీసులు అనుమానిత ఇళ్లలో రైడ్ నిర్వహించారు.ఇక పోలీసులు వస్తున్నారన్న సంగతి ముందుగానే తెలుసుకొని, నిందితులు ఎక్కడికక్కడ పరారయ్యారు.

"""/" / కొందరు బయటకు వెళ్లిపోగా మరికొందరు ఇంటి మిద్దె మీదికి కొందరు, రోడ్ల మీదికి కొందరు పరుగెత్తారు.

అయితే రాబర్ట్( Robert ) అనే దొంగ మాత్రం అతితెలివితో ఆలోచించాడు.పోలీసులకు కనబడకుండా ఉండేందుకు ఇంటిలో ఉన్న చిమ్నీ గొట్టంలో దాక్కుందామని ట్రై చేసాడు.

పోలీసులు వచ్చేలోపు ఆ చిమ్నీ గొట్టంలో నుంచి పైకి ఎక్కి సేఫ్‌గా తప్పించుకోవచ్చని ప్లాన్ వేసాడు.

కానీ, రాబర్ట్ ప్లాన్ అడ్డం తిరిగింది.చిమ్నీలో నుండి రాబర్ట్ క్రమంగా పైకి ఎక్కుతుండగా చిమ్నీ వెడల్పు తగ్గిపోయింది.

దీంతో ఒక ఎత్తుకి వెళ్లిన తర్వాత ఇంకా పైకి వెళ్లడం అతడికి సాధ్యపడలేదు.

దాంతో అక్కడే రాబర్ట్ ఇరుక్కుపోయాడు.కట్ చేస్తే, పోలీసుల నుంచి తప్పించుకుందామని ట్రై చేసిన రాబర్ట్ చివరికి పోలీసుల సాయమే కోరాడు.

తనను రక్షించాలని గట్టిగా కేకలు వేయడంతో చిమ్నీలో ఉన్న రాబర్ట్ ని కాపాడి, అరెస్ట్ చేసారు.

ఈ ఆహారాలు తింటే బ్రెస్ట్ క్యాన్స‌ర్ రిస్క్ త‌గ్గుద‌ట‌.. తెలుసా?