పిల్లలమర్రి మత్స్య కార్మిక సొసైటీతో వారికి సంబంధం లేదు…!

సూర్యాపేట జిల్లా: సూర్యపేట మండలం పిల్లలమర్రి మత్స్యకార్మిక సొసైటీతో రాయినిగూడెం సొసైటీకి ఎలాంటి సంబంధం లేదని పిల్లలమర్రి మత్స్యకార్మిక సంఘం అధ్యక్షులు తూటిపల్లి మహేష్‌ అన్నారు.

బుధవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మొదటి నుండి పిల్లలమర్రి,రాయినిగూడెం గ్రామ పంచాయితీలు వేరుగా ఉన్నాయని,పిల్లలమర్రి ప్రీ విలేజ్ కావడంతో ప్రభుత్వ నిబంధనల ప్రకారం 2018 లో పిల్లలమర్రి సొసైటీ ఏర్పాటు చేసుకున్నామని పేర్కొన్నారు.

అప్పటి నుంచి పిల్లలమర్రి చెరువులోనే చేపలు పట్టుకొని జీవనం గడుపుతున్నామన్నారు.రాయినిగుడెం సభ్యులకు కేతబోయిన చెరువు,ఊర కుంట,నూతనంగా తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన చెక్ డ్యాంతో పాటు సూర్యాపేట సద్దుల చెరువులో సగ భాగం ఉందన్నారు.

గతంలో సూర్యాపేట పట్టణానికి చెందిన సొసైటీ నాయకుడు పిల్లలమర్రి సొసైటీ కావాలంటే తనకు రూ.

5 లక్షలు ఇవ్వాలని లేకుంటే కానివ్వనని బెదిరించారని,అంత డబ్బు ఇచ్చుకొలేమని చెప్పడంతో వ్యక్తి గతంగా కోపం పెంచుకొని సొసైటీ కాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు.

తాను చెప్పిన మాట వినకుంటే సద్దుల చెరువులో భాగం ఇవ్వమని రాయినిగూడెం సభ్యులను సైతం బ్లాక్ మెయిల్ చేస్తున్నారన్నారు.

బ్లాక్ మెయిలింగ్ పాల్పడే వారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలోసభ్యులు తుటిపల్లి శ్రీను,వీరయ్య, సత్తయ్య,సాంబయ్య, నూతి సైదులు, చింతకాయల రమేష్, తదితరులు పాల్గొన్నారు.

లెబనాన్‌లో పేజర్ పేలుళ్ల వెనక హస్తం .. కేరళవాసి కోసం నార్వే వేట, లుకౌట్ నోటీసులు జారీ