ఆ కేఫ్ లో బ్రేక్ అప్ అయిన వాళ్లకి ఫ్రీగా ‘టీ’ ఇస్తారు… ట్రై చేస్తారా?

ఇలాంటి విషయాన్ని బహుశా, మీరు మొదటి సారి వినుంటారు.లేదంటే ఇక్కడ బ్రేకప్ అయిన వాళ్ళ గురించి పట్టించుకునే నాధుడు ఉంటాడా చెప్పండి.

నచ్చిన గర్ల్ ఫ్రెండ్ తో బ్రేకప్ అయితే తోటి స్నేహితులే గేలి చేస్తూ వుంటారు.

కానీ అతను అలా చేయలేదు.బ్రేకప్ అవుతున్న భగ్న ప్రేమికుల వ్యధలను గురించి అతగాడు బాధపడ్డాడు.

వారి గురించి ఏదైనా చేద్దామని అనుకున్నాడు.ఈ క్రమంలోనే అతను చేసిన పని ప్రేమపక్షులకు విపరీతంగా నచ్చేసింది.

ఇంకేముంది కేట్ చేస్తే అతగాడు స్టార్ట్ చేసిన కెఫెలో వచ్చి వాలిపోతూ.వారి సాధకబాధలు తీర్చుకుంటున్నారు.

"""/" / అయితే దానివెనుక పెద్ద కధే వుంది.అతగాడు కూడా ఓ బాధితుడే.

మొరాదాబాద్‌( Moradabad )కు చెందిన ఓ యువకుడు ప్రియురాలు చేసిన మోసాన్ని తలుచుకొని కృంగిపోలేదు.

దాన్నే బలంగా చేసుకొని ఉపాధి మార్గంగా మార్చుకున్నాడు.ఈ క్రమంలోనే హంబాద్ షంషీ అప్నా బేవఫా చాయ్ వాలే( Bewafa Chai Wala ) పేరుతో ఓ కేఫ్‌ను స్టార్ట్ చేసాడు.

ఈ కేఫ్ స్పెషాలిటీ ఏంటంటే.రీసెంట్ గా బ్రేకప్ అయిన జంటలు.

ఇక్కడకు వచ్చి ఉచితంగా టీ తాగోచ్చు.ఇక మిగిలిన ప్రేమ జంటలకు చాలా ఇక్కడ తక్కువ ధరకే టీ లభిస్తోంది.

షాప్ పేరుతో పాటు, వారి టీ రుచి కూడా చాలా బాగుందని ప్రేమికులు ఆ యువకుడిని జనాలు మెచ్చుకుంటున్నారు.

"""/" / అయితే ఈ కేఫ్ వెనుక పెద్ద మోటివ్ ఉందండోయ్.కేవలం ప్రేమ జంటల కోసమే ప్రత్యేకంగా ఈ కేఫ్‌ని ప్రారంభించామని షాప్ యజమాని హంబద్ షంషి అంకిత్ చెబుతున్నాడు.

విడిపోవాలనుకొనేవారు ఇక్కడకు వచ్చి ఓ అరగంట టైం స్పెండ్ చేసి వారి లోపాలను సరిచేసుకొని మరలా తమ ప్రేమ ప్రయాణాన్ని కొనసాగిస్తారని.

ఆ మోటివ్ తోనే ఈ స్టాల్ స్టార్ట్ చేసానని చెప్పుకొస్తున్నారు మన భగ్న ప్రేమికుడు.

ఇకపోతే అతి కొద్దికాలంలోనే డేటింగ్ చేయాలనుకునే లవర్స్.లేదా ఇటీవల బ్రేకప్ అయిన వారికి లేదా ప్యాచ్ అప్ అవ్వాల్సిన వారికి.

ఈ కేఫ్ కేరాఫ్ మారిపోయింది.జంటలు ఒకరితో ఒకరు విడిపోకూడదని, ప్యాచ్‌అప్‌గా ఉండాలని ప్రయత్నిస్తున్నామని అంకిత్ చెబుతున్నాడు.

రాజమౌళి లేకపోతే సినిమాలో ప్రభాస్ శీను ఉండకపోయేవాడు కాదు..?