ప్రెగ్నెంట్ అని ఉద్యోగం పీకేశారు.. చివరి ట్విస్ట్‌కి ఫ్యూజులు ఔట్!

ఒక మహిళా ఉద్యోగి ఇటీవల ప్రెగ్నెన్సీ కారణంగా తనకు కొద్ది రోజులు సెలవులు ఇవ్వాలని తన మేనేజర్లను అడిగింది.

అయితే వారు మేటర్నిటీ లీవ్ ఇచ్చే రూల్ తమ కంపెనీలో లేదంటూ ఆమెను ఉద్యోగం నుంచి పీకేశారు.

నిజానికి ఆమె చాలాసార్లు గర్భవతి అయ్యింది కానీ అబార్షన్ల కారణంగా బిడ్డను కనలేకపోయింది.

దానివల్ల ఈసారైనా బిడ్డను కనాలనే ఆశతో జాబును వదిలేసుకుంది.అయితే దురదృష్టవశాత్తు ఆమె కడుపులోని బిడ్డ చనిపోయింది.

దాంతో ఆమె చాలా నిరాశ పడిపోయింది.ఒకవైపు ఉద్యోగం, మరోవైపు బిడ్డ చనిపోవడం ఆమెను మరింత మానసిక శోభకు గురి చేసింది.

అదే సమయంలో ఆమె ఉపాధి ట్రిబ్యునల్‌లో కంపెనీపై కేసు ఫైల్ చేసింది.ట్రిబ్యునల్‌ కోర్టు రూ.

15 లక్షలు నష్టపరిహారంగా ఆమె చెల్లించాలని ఆదేశించింది దాంతో కంపెనీ ఆమెకు ఆ మొత్తాన్ని అందజేసింది.

ఈ ఘటన యూకేలో చోటుచేసుకుంది.ఆ మహిళా ఉద్యోగి పేరు షార్లెట్ లీచ్ (34).

తాను ఎసెక్స్ ఆధారిత సెక్యూరిటీ సిస్టమ్ సప్లయర్ సంస్థ పరిపాలన విభాగంలో పనిచేసింది.

ఆమె కేసును క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత ఆ మహిళకు రూ.15 లక్షలు (సుమారు 14,885 పౌండ్లు) పరిహారంగా అందించారు.

"""/"/ లీచ్ తన ఉద్యోగాన్ని CIS సర్వీసెస్‌లో 2021 మేలో అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్‌గా ప్రారంభించింది.

ఆమె వార్షిక వేతనం ప్యాకేజీ దాదాపు రూ.20 లక్షలు.

అయితే దాదాపు ఒక సంవత్సరం పాటు బతికే డబ్బులను ఆమె గెలుచుకోవడం గురించి తెలుసుకొని అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

ఈ విషయంలో ఆమెకు న్యాయం చేసిన కోర్టును చాలామంది పొగుడుతున్నారు.