నమ్మకద్రోహంతో నన్ను రోడ్డున పడేశారు.. సీనియర్ నటి కామెంట్స్ వైరల్!
TeluguStop.com
సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటులు రాకముందు వచ్చిన తర్వాత ఎన్నో కష్టాలను అధిగమించి, పోటీని తట్టుకుని నిలబడుతూ వారి కంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుని అంతో ఇంతో ఆస్తులను కూడబెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు.
అయితే అలా ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బును పోగొట్టుకున్న వారు కూడా ఎంతోమంది ఉన్నారు.
ఇంకొందరు సెలబ్రిటీలు సొంత వారిని నమ్మి వారి చేతిలో దారుణంగా మోసపోయిన వారు కూడా చాలామంది ఉన్నారు.
అలాంటి వారిలో షావుకారు జానకి కూడా ఒకరు.1950 లో వచ్చిన షావుకారు జానకి సినిమాతో తెలుగు లోని హీరోయిన్ అనిపించుకుంది జానకి.
అంతేకాకుండా అప్పట్లోనే మద్రాసులోని సంపన్నుల కుటుంబాల జాబితాలో షావుకారు జానకి పేరు కూడా వినిపిస్తూ ఉండేది.
అప్పట్లోనే పెద్దపెద్ద ఖరీదైన బంగ్లాలు కార్లు తోటలు పొలాలు ఇవన్నీ కూడా ఆమె పేరు పై ఉండేవి.
అయితే ఒకానొక సమయంలో ఆమె అవన్నీ కూడా పోగొట్టుకునే రోడ్డుపైకి వచ్చేశానని, కొంతమంది నమ్మడం వల్ల ఆ పరిస్థితి తనకు వచ్చింది అంటూ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలిపింది షావుకారు జానకి.
ఇంటర్వ్యూ లో భాగంగా ఆమె మాట్లాడుతూ.జీవితం వేరు సినిమా వేరు.
జీవితంలో డబ్బు విషయంలో ఆస్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.అంతేకాకుండా వేరొకరికి పెత్తనం ఇస్తున్న సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి అని తెలిపింది.
"""/"/నేను కొంతమంది నమ్మడం వల్ల నాకు ఉన్నదంతా పోగొట్టుకున్నాను.ఇదే విషయాన్ని ఇప్పటివరకు నేను ఎవరికీ ఎక్కడా చెప్పలేదు.
ఒకానొక సమయంలో రోడ్డు మీదకి వచ్చేసాను.ఎంతో విలువైన ఆస్తులు కూడా పోగొట్టుకున్నాను అని చెప్పుకొచ్చింది షావుకారు జానకి.
నాకు ఉన్న 12 ఎకరాల విలువైన భూమిని పోగొట్టుకున్నప్పుడు నేను ఎక్కడా చెప్పుకోలేదు ఇలా జరగడాన్ని విధి అనుకోలేదు కానీ నమ్మకద్రోహం అనే అనుకుంటాను అని చెప్పుకొచ్చింది.
మనవాళ్లే కదా అని పెత్తనం ఇవ్వడం వలన అలా జరిగింది.అంతా పోయినప్పుడు కూడా నేను బాధపడలేదు కాళ్లు చేతులు బాగుంటే సంపాదించుకోవచ్చు అనే అనుకున్నాను అని చెప్పుకొచ్చింది జానకి.
ఓటీటీ రైట్స్‌తో కోట్లు కొల్లగొట్టిన సినిమాలివే.. ఈ సినిమాలదే అద్భుతమైన రికార్డ్!