వీడియో: బతికుండగానే పూడ్చేశారు.. వ్యూస్, లైక్స్ కోసమే అలా చేశారట..?
TeluguStop.com
ఈరోజుల్లో చాలామంది సోషల్ మీడియాలో( Social Media ) ఎక్కువ వ్యూస్, లైక్స్ దక్కించుకోవాలని వివిధ రకాల సాహసాలు చేస్తున్నారు.
తమ ప్రాణాలను కూడా పణంగా పెడుతున్నారు.ఈ లైక్స్ వల్ల వాళ్లకి వచ్చేది ఏంటో తెలియదు.
ప్రాణాల కంటే ఈ వ్యూస్, లైక్స్ అనేవి ముఖ్యమా అని చాలామంది ప్రశ్నిస్తున్నా వీళ్ళు అలాగే మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు.
కొద్ది రోజుల క్రితం ఇద్దరు యువకులు ( Young People )రోడ్డుపై రీల్స్ చేస్తూ ప్రమాదానికి గురయ్యారు.
మరో సంఘటనలో పదహారేళ్ల బాలిక ఆరవ అంతస్తు పైనుంచి కిందపడి తీవ్ర గాయాలు పాలయ్యింది.
దీనంతటికీ కారణం సోషల్ మీడియాలో పాపులర్ కావాలని వారు కోరుకోవడమే. """/" /
తాజాగా ఒక వ్యక్తి సోషల్ మీడియా వ్యూస్, లైక్స్ కోసం తననే తాను సమాధి చేయించుకున్నాడు.
అతని పక్కన ఇద్దరు ఉన్నారు.వీళ్లు గుంత తీయగా ఆ మనిషి తన ముఖానికి ఒక గుడ్డ చుట్టుకుని ఆ గుంతలో పడుకొని చేతులు వెనక్కి పెట్టి మట్టితో కప్పించుకున్నాడు.
అంటే ఛాతీ నుంచి ముఖం దాకా మట్టితో కప్పించుకోగా కాళ్ళ భాగం మాత్రం మట్టితో కవర్ చేయలేదు.
అతడి పక్కన ఉన్న ఒక యువకుడు, ఒక మహిళ వీడియో చేస్తూ తమకు లైక్స్, వ్యూస్ కావాలంటూ దండం పెట్టారు.
ఈ వీడియోకి వచ్చే లైక్స్, వ్యూస్ మాత్రమే తమకు తిండి పెడతాయి అన్నట్టు వాళ్ళు దీనంగా దండం పెడుతూ కోరటం చూస్తుంటే ఎవరైనా సరే షాక్ కావాల్సిందే.
"""/" /
@Gaitondu అనే ఒక ఎక్స్ అకౌంట్ ఈ వీడియోని షేర్ చేసింది.
దీనికి ఒక లక్ష 16 వేల వ్యూస్ వచ్చాయి.ఇలా మట్టితో కప్పించుకోవాల్సిన అవసరం ఏంటి అని ఈ వీడియో షేర్ చేస్తూ ఒక క్యాప్షన్ జోడించారు.
సోషల్ మీడియా వల్ల ప్రజలు పిచ్చోళ్ళు అయిపోతున్నారు అని దీన్ని చూసిన నెటిజన్లు కామెంట్ చేశారు.
ఈ షాకింగ్ వీడియోను మీరు కూడా చూసేయండి.
పుష్ప2 మూవీ వల్ల గేమ్ ఛేంజర్ కు భారీ షాక్.. అక్కడ ఆ సంబరాలు లేనట్టే?