V Hanumantha Rao : షర్మిలపై దుష్ప్రచారం చేస్తున్నారు..: వీహెచ్
TeluguStop.com
ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల( AP PCC Chief YS Sharmila ) గురించి తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.
హనుమంతరావు( V Hanumantha Rao ) కీలక వ్యాఖ్యలు చేశారు.షర్మిలపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) తల్లిని, చెల్లిని జగన్ దూరం పెట్టారని విమర్శించారు.
చెల్లికి అవమానం జరుగుతుంటే జగన్ కు బాధ్యత లేదా అని ప్రశ్నించారు.వైఎస్ షర్మిల, వైఎస్ సునీతపై( YS Suneetha ) జగన్ కు గౌరవం లేదన్నారు.
"""/" /
చెల్లెళ్లపై ప్రేమలేని జగన్ .మహిళా సాధికారత అంటున్నారని విమర్శించారు.
షర్మిల వైఎస్ఆర్ కూతురు కాదని ఆరోపణలు చేస్తూ పోస్టర్లు వేస్తుంటే జగన్ సైలెంట్ గా ఉండటం ఏంటని ప్రశ్నించారు.
జగన్ జైల్లో ఉన్నప్పుడు షర్మిల అన్నకి సపోర్ట్ చేసిందన్న వీహెచ్ రాజకీయాల కోసం జగన్ ఇంత దిగజారుతారా అని కామెంట్స్ చేశారు.
నాని స్టార్ హీరోగా మారే అవకాశం వచ్చిందా..?