నా ఎమోషనల్ సపోర్ట్ వాళ్లే.. దుల్కర్ కామెంట్స్ వైరల్!

మహానటి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు మలయాళీ నటుడు దుల్కర్ సల్మాన్.

ఈయన ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను సందడి చేశారు.అయితే తాజాగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సీతారామం సినిమా ద్వారా దుల్కర్ సల్మాన్ మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమాతో ఈయన మరో మంచి హిట్ సినిమాని తన ఖాతాలో వేసుకున్నారు.

ఇకపోతే ఈ సినిమా మంచి విజయం కావడంతో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దుల్కర్ తన గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

తాను ఒక స్టార్ కిడ్ గా ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ తాను కూడా అందరిలాగే ఇండస్ట్రీలో కెరియర్ మొదట్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నానని ఈ సందర్భంగా దుల్కర్ వెల్లడించారు.

ఇక నాన్న సూపర్ స్టార్ కావడంతో నాపై మరిన్ని బాధ్యతలు కూడా ఉన్నాయని ఈయన తెలిపారు.

ఇక ఏ విషయంలోనైనా నాకు నా కుటుంబం నా స్నేహితులు ఒక ఎమోషనల్ సపోర్ట్ అని కొద్దిగా నా మొహంలో ఎక్స్ప్రెషన్స్ మారిన వెంటనే నన్ను గుర్తించి ఏం జరిగింది అంటూ ఆరా తీస్తారని, ఈ విషయంలో తాను ఎంతో అదృష్టవంతుడిను అంటూ దుల్కర్ వెల్లడించారు.

"""/" / ఇకపోతే తన సినిమాలు నాన్న చూసినప్పటికీ ఆయన సినిమా ఎలా ఉంది ఏంటి అనే విషయాలు మాత్రం చెప్పరని,ఆయన సినిమా చూస్తున్నప్పుడు ఆయన ముందు నేను కూర్చుని తన ఫేస్ లో మారుతున్న ఎక్స్ప్రెషన్స్ బట్టి ఆ సినిమా ఆయనను ఏ విధంగా ఆకట్టుకుంది తనకు ఎలా నచ్చిందనే విషయాలను గుర్తిస్తానని అలా ఆయన మొహంలో కనిపించే చిరునవ్వు, ఆయన కొట్టే చెప్పట్లే నా సినిమాకు కాంప్లిమెంట్స్ అంటూ దుల్కర్ సల్మాన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

సరిగా కాళ్లు కూడా అందట్లేదు కానీ.. బీజీ రోడ్డులో బైక్‌పై దూసుకెళ్లారు.. చివరికి??