నమ్మినోళ్లే ముంచుతుండ్రు ! అన్ని పార్టీల్లోనూ అదే తంతు
TeluguStop.com
ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల పోరు హోరాహోరీగా ఉంది.ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాల్లో నిమగ్నమయ్యాయి.
ప్రత్యర్థులపై పైచేయి సాధించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి.దీనికి తోడు పార్టీ టికెట్ దక్కని వారు రెబల్ గా పోటీ చేయడం, మరి కొంతమంది ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీ చేస్తూ ఉండడం వంటివన్నీ ప్రధాన పార్టీ అభ్యర్థులకు ఇబ్బందికరంగా మారాయి.
ఇవన్నీ పక్కన పెడితే వెన్నుపోటు రాజకీయాలు( Politics ) అంతే స్థాయిలో అన్ని పార్టీలను కలవర పెట్టిస్తున్నాయి.
దీంతో ఎవరిని నమ్మాలో ఎవరిని పక్కన పెట్టాలో తెలియని పరిస్థితిలో ఆయా పార్టీల అభ్యర్థులు ఉన్నారు.
"""/" /
ఎవరికి ముందుగా తమ వ్యూహాలను చెప్పుకోలేక సతమతం అవుతున్న అభ్యర్థులు చాలామందే ఉన్నారు.
ముఖ్యంగా అధికార పార్టీ బీఆర్ఎస్ ( BRS )లోనూ వెన్నుపోటు రాజకీయాలు ఎక్కువగానే ఉన్నాయట.
ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఖానాపూర్ , నిర్మల్ , చెన్నూరు( Khanapur, Nirmal, Chennur ) నియోజకవర్గాల్లో ఎక్కువగా వెన్నుపోటు ప్రభావాన్ని అభ్యర్థులు ఎదుర్కుంటున్నారట.
మిగతా నియోజకవర్గాల్లో ఇదే రకమైన పరిస్థితి ఉన్నా, ఈ నాలుగు నియోజకవర్గాల్లో మాత్రం ఈ ఇబ్బంది తీవ్రంగా ఉందట .
అధికార పార్టీకి చెందిన నేతలు సొంత పార్టీలోనే కొనసాగుతూ తమ వెంట ఉన్న ముఖ్య నేతలు ,అనుచరులతో పాటు కార్యకర్తలను ఎదుటి పార్టీలోకి పంపిస్తున్నారట.
"""/" /
తమ ప్రత్యర్థులు వేసే రాజకీయ వ్యూహాలను( Political Strategies ) ముందుగానే తెలుసుకుని దానికి తగ్గట్టుగానే ప్రతి వ్యూహాలను ముందుగానే అమలు చేస్తున్నారట .
ఈ పరిస్థితి కాంగ్రెస్ బిజెపిలకు చెందిన అభ్యర్థులకు కూడా ఎదురవుతోందట.ఇప్పటికే ఆయా పార్టీల నేతలు తమ అనుచరులను ఎదుటి పక్షాలకు పంపించినట్లుగా అనుమానాలు నెలకొన్నాయి.
ఈనెల 20 తర్వాత ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
గతంలో తమతో సన్నిహితంగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇతర పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు తమను పట్టించుకోలేదని , ఎన్నికల సమయంలో చేరదీస్తున్నారనే కోపంతో ఆయా పార్టీల నేతలు తమ అనుచరులను ఇతర పార్టీలోకి పంపించి అక్కడ చోటు చేసుకునే పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారట.
దీంతో ఎవరు నిజంగా అభిమానంతో పార్టీలో చేరారో, ఎవరు వెన్నుపోటు పొడిచేందుకు పార్టీలు చేరారో తెలియక అభ్యర్థులు సతమతం అవుతున్నారట.
ఏపీ టెట్ పరీక్షలో 150కు 150 మార్కులు.. అశ్విని సక్సెస్ స్టోరీకి గ్రేట్ అనాల్సిందే!