ఉచితాల పేరుతో ప్రజలను మభ్య పెడుతున్నారు..: ఎంపీ లక్ష్మణ్

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఉచితాల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు.

అమలుకు నోచుకోని హామీలు ఇస్తున్నారని ఎంపీ లక్ష్మణ్ మండిపడ్డారు.అభివృద్ధిని బీఆర్ఎస్ ప్రభుత్వం పక్కన పెట్టిందన్నారు.

అటు కర్ణాటకలో ఆరు నెలల క్రితం ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేయలేదని చెప్పారు.

రెండు గంటల కంటే కరెంట్ ఇవ్వలేకపోతున్నామని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అంటున్నారని తెలిపారు.

అలాగే సన్నబియ్యం ఇస్తామని చెప్పి ఇవ్వడం లేదని విమర్శించారు.

మహేష్, బన్నీ, రవితేజ తర్వాత నితిన్.. ఈ యంగ్ హీరో ప్లాన్ అదుర్స్ అంటూ?