రాజకీయ పరపతిని దెబ్బతీసేలా వ్యవహారిస్తున్నారు..: ఎమ్మెల్సీ కవిత

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( BRS MLC Kavitha ) తీహార్ జైలు నుంచి లేఖ రాశారు.

ఈ లేఖ ద్వారా న్యాయమూర్తికి తన వాదనను కవిత తెలియజేశారు.ఈ మేరకు తాను చెప్పదలచుకున్న అంశాలను నాలుగు పేజీల లేఖలో పేర్కొన్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కాం( Delhi Liquor Scam ) కేసు తప్పుడు కేసు అని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.

సీబీఐ అధికారులు తనను జైల్లో ప్రశ్నించారని చెప్పారు.వేరే వ్యక్తుల స్టేట్ మెంట్ ఆధారంగా తనను అరెస్ట్ చేశారని తెలిపారు.

రెండున్నరేళ్ల విచారణలో ఎలాంటి ఆధారాలు దొరకలేదన్న కవిత తాను తప్పు చేశాననడానికి ఎలాంటి ఆధారాలు లేవని వెల్లడించారు.

లిక్కర్ పాలసీలో( Liquor Policy ) తనకు ఎలాంటి ఆర్థికపరమైన లాభం చేకూరలేదని స్పష్టం చేశారు.

లిక్కర్ కేసులో తాను బాధితురాలినన్న కవిత తన రాజకీయ పరపతిని దెబ్బతీసేలా వ్యవహారిస్తున్నారని లేఖలో తెలిపారు.

ఆన్లైన్లో విషం తెప్పించుకొని సూసైడ్ చేసుకున్న హైదరాబాద్ టెక్కి..