జనహితమే లక్ష్యంగా పని చేసే వారంతా జర్నలిస్టులే

సూర్యాపేట జిల్లా:జనహితమే లక్ష్యంగా పని చేసే ప్రతి ఒక్కరూ జర్నలిస్టులేనని డీజేఎఫ్ జాతీయ అధ్యక్షుడు మానసాని కృష్ణారెడ్డి అన్నారు.

జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగిన డిజేఎఫ్ జిల్లా కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా జర్నలిస్టుల హక్కుల సాధనే ధ్యేయంగా,చిన్న,పెద్ద జర్నలిస్టులు అంటూ తారతమ్యం లేకుండా,పోరాటమే మార్గంగా ఏర్పడిన ప్రగతిశీల పాత్రికేయ ఐక్య కూటమి (డి.

జె.ఎఫ్) డెమొక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అని తెలిపారు.

ప్రజలకు,ప్రభుత్వాలకు మధ్య వారధిగా ఉంటూ చిన్న,మధ్యతరగతి,పెద్ద పత్రికలు,కేబుల్,డిజిటల్, వెబ్,యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ లో పని చేస్తున్న వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్,విద్య,వైద్య సదుపాయాలు,ఇంకా అనేక రకాలైన సమస్యల సాధన కొరకు నిర్మాణాత్మకంగా,సంఘటితంగా డిజెఎఫ్ పోరాటం చేస్తుందన్నారు.

భవిష్యత్ లో డిజెఎఫ్ దేశంలోనే ఒక బలమైన జర్నలిస్ట్ యూనియన్ గా ఏర్పడనుందని ప్రకటించారు.

వర్కింగ్ జర్నలిస్టుల పైన ఎలాంటి దాడులు జరిగినా డిజెఎఫ్ జర్నలిస్టుల పక్షాన నిలబడి తీవ్రంగా ప్రతిఘటిస్తుందని తెలిపారు.

సూర్యాపేట జిల్లాలో డిజెఎఫ్ ను సంస్థాగతంగా బలోపేతం చేయడానికి దశ,దిశ నిర్దేశం చేశారు.

స్టేట్ కమిటీ సభ్యులు యం.డి రెహమాన్ అలీ అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో డిజెఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఏనుగు మల్లారెడ్డి,స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాసం రత్నాకర్,స్టేట్ సెక్రెటరీ కె.

బుచ్చిరాములు, జిల్లా అధ్యక్షులు రమణ చోల్లేటి,వివిధ మండల అధ్యక్షులు సైదులు,చాంద్ పాషా,రవివర్మ,డిజెఎఫ్ సభ్యులు గోపిరాజ్,డి.

శ్రీనివాస్,ముచ్చ రమేష్ డి.సంతోష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ఏపీలో నేడు పెన్షన్ పండుగ.. చంద్రబాబే స్వయంగా వెళ్లి