ఈ రాశులు అంటే పరమేశ్వరుడికి చాలా ఇష్టం..! ఆ రాశులు ఏవో తెలుసా .?

ప్రతి సోమవారం శివుడికి అన్ని సంప్రదాయాలతో పూజిస్తారు.అలాగే శివాలయాల్లో కోరికలు నెరవేరేందుకు రుద్రాభిషేకం కూడా చేస్తారు.

ఆ రోజున భక్తులు ఉపవాసం కూడా చేస్తారు.ఇలా చేయడం వలన శివుని అనుగ్రహం ఉంటుంది అని నమ్మకం.

అయితే శివునికి ఈ రాశులు అంటే ఇష్టం.ఆ రాశులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషరాశి:( Aries ) అంగారకుడు ఈ రాశికి అధిపతి కావడంతో శివుడు ఈ రాశిలో ఉన్న వ్యక్తులకు ప్రత్యేక దీవెనలు ఇస్తాడు.

శివునిలో అంగారక గ్రహాన్ని భాగంగా పరిగణిస్తారు.ఇక హిందూ పురాణాల ప్రకారం అంధకాసురుడు అనే రాక్షసుడితో పోరాడే సమయంలో శివుని చమట చుక్క నేలను తాకింది.

ఆ సమయంలోనే అంగారకుడు ఉద్భవించాడు.ఆ సమయంలోనే శివుడు( Lord Shiva ) కోపంగా ఉన్నాడు.

అందుకే సులభంగా కోపం తెచ్చుకుంటాడు.మేషరాశి వారు మహాశివరాత్రిలో అన్ని ఆచారాల ప్రకారం శివుడిని పూజించాలి.

అలాగే శివునికి గంగాజలం, ఆవుపాలను నైవేద్యంగా సమర్పించాలి.ఇలా చేయడం వలన వారి వృత్తికి సహాయపడుతుంది.

వృశ్చిక రాశి: కుజుడు వృశ్చిక రాశి( Scorpio ) వారికి కూడా అధిపతి.

ఈ శివరాత్రికి పరమశివుడు వారికి విశేషమైన అనుగ్రహాన్ని పొందుతాడు.ఆలయాలలో శివునికి అభిషేకం చేయాలి.

ఇలా చేయడం వలన ఉద్యోగం, వ్యాపారంలో విజయం సాధించడంలో సహాయపడుతుంది. """/" / మకర రాశి: మకర రాశికి ( Capricorn )శని దేవుడు అధిపతి.

పరమేశ్వరుడికి అత్యంత ఇష్టమైన భక్తులలో శని దేవుడు ఒకరు.కాబట్టి మకర రాశి వారికి శని దేవుడు, మహాదేవుని నుండి ప్రత్యేక ఆశీర్వాదాలు ఉంటాయి.

ఈ రాశి వారు శివున్ని పూజించడం కోసం బిల్వపత్రం, గంగాజలం, ఆవు పాలు మొదలైన వాటిని ఉపయోగించాలి.

"""/" / కుంభరాశి: ( Aquarius )ఈ రాశి వారికి కూడా శని దేవుడు అధిపతి.

కాబట్టి వారు సోమవారం రోజున శివున్ని పూజించాలి.అలాగే ఉపవాసం కూడా చేయాలి.

ఇలా చేయడంతో మీరు వృత్తిపరంగా విజయం సాధిస్తారు.అలాగే సంపదతో పాటు ఆదాయం కూడా పెరుగుతుంది.

ఈ బాలుడు మృత్యుంజయుడా.. మూడో అంతస్తు నుంచి పడినా బతికే ఉన్నాడు.. వీడియో చూడండి!