వైసిపి మూడో జాబితా రెడీ ! టికెట్ దక్కని వారి దారటే ?

రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ సర్వేలు చేయించి పార్టీ పరిస్థితి, ప్రజల్లో ఉన్న సానుకూలత, వ్యతిరేకత వంటి అన్ని అంశాల పైన ఒక అవగాహనకు వచ్చారు వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్.

( CM Jagan ) దానికి అనుగుణంగానే ఇప్పుడు పార్టీలో భారీ ప్రక్షాళనకు తెర తీశారు.

వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా గెలవాలనే పట్టుదలతో ఉన్న జగన్, దానికి అనుగుణంగానే కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు.

ఇప్పటికే రెండు విడతలుగా నియోజకవర్గ ఇన్చార్జిలను( YSRCP Constituency Incharges ) ప్రకటించారు.

మొదటి విడతలో 11 మంది, రెండో విడతలో 38 మందిని ప్రకటించగా, మూడో జాబితా కూడా సిద్ధమైంది.

సరైన సమయం చూసుకొని ఈ జాబితాను విడుదల చేసేందుకు జగన్ సిద్ధమవుతున్నారు.టికెట్ దొరికే అవకాశం లేదనుకున్న వారిని నేరుగా తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి పిలిపించి జగన్ వారిని బుజ్జగించే  ప్రయత్నం చేస్తున్నారు.

"""/" / వచ్చే ఎన్నికల్లో మహిళలు ,యువతకు ,అలాగే ఎస్సీ ,ఎస్టీ ,బీసీ మైనారిటీలకు ఎక్కువ ప్రాధాన్యం కల్పించే విధంగా జగన్ ముందుకు వెళ్తున్నారు.

మూడో విడత( Third List ) జాబితాలో 25 మంది నియోజకవర్గ ఇన్చార్జిల పేర్లను జగన్ ప్రకటించనున్నారు.

ఆ జాబితాను ఈ రోజే విడుదల చేయనున్నట్లు వైసిపిలోని( YCP ) కీలకవర్గాల ద్వారా తెలుస్తోంది.

అనంతపురం ,శ్రీ సత్యసాయి పుట్టపర్తి, కర్నూలు ,నంద్యాల , ప్రకాశం, బాపట్ల, పలనాడు జిల్లాలోని నియోజకవర్గాలకు సంబంధించిన జాబితాను జగన్ ప్రకటించనున్నారు.

అనంతపురం జిల్లాలోని రాయదుర్గం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కాపు రామచంద్ర రెడ్డికి( Kapu Ramachandra Reddy ) ఈసారి టికెట్ లభించడం లేదని ప్రచారం జరుగుతోంది.

దీంతో ఆయన వైసీపీకి రాజీనామా చేశారు.స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే ఆలోచనతో ఉన్నారు.

దీంతో రాయదుర్గానికి ఎవరిని ఇన్చార్జిగా నియమిస్తారనేది ఈరోజు ప్రకటించే జాబితాలో తేలనుంది. """/" / అదే విధంగా కర్నూలు జిల్లాలోని ఆలూరు నియోజకవర్గం లో కూడా మార్పు చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గుమ్మనూరు జయరాంకు( Gummanuru Jayaram ) ఈసారి టికెట్ దక్కే అవకాశం లేదని , కొత్త వారిని నియమించే ఆలోచనలో జగన్ ఉన్నారని ప్రచారం జరుగుతోంది.

తనకు టికెట్ దక్కని పక్షంలో వైసిపిని వీడే ఆలోచనలు కూడా జయరాం ఉన్నట్లు సమాచారం .

వైసీపీలో టిక్కెట్లు దక్కని చాలామంది కి కాంగ్రెస్ ఆప్షన్ గా కనిపిస్తోంది.త్వరలోనే ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్న వైఎస్ షర్మిల సమక్షంలో వైసీపీకి చెందిన అసంతృప్త నాయకులు చేరబోతున్నట్లు సమాచారం.

అప్పుడు మీరు .. ఇప్పుడు వారు  ! రిటర్న్ గిఫ్ట్ అంటే ఇదే బాసూ