విటమిన్ `సి`నే కాదు..ఇవీ ఇమ్యూనిటీని పెంచుతాయని మీకు తెలుసా?
TeluguStop.com
ప్రస్తుతం వింటర్ సీజన్ కొనసాగుతోంది.ఈ సీజన్‌లో వివిధ రకాల వైరస్‌లకు, ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉండాలీ అనుకుంటే ఖచ్చితంగా ఇమ్యూనిటీ సిస్టమ్‌ను స్ట్రాంగ్‌గా మార్చుకోవాలి.
లేదంటే ఏదో ఒక అనారోగ్యం వచ్చి చుట్టూ ముట్టేస్తుంటుంది.అయితే ఇమ్యూనిటీ పవర్ అనగానే టక్కున అందరికీ విటమిన్ సి, విటమిన్ సి ఫుడ్సే గుర్తుకు వస్తాయి.
అయితే విటమిన్ సి ఒక్కటే కాదు.మరికొన్ని విటమిన్స్ సైతం ఇమ్యూనిటీని పవర్‌ను పెంచడానికి తోడ్పడతాయి.
మరి ఆ విటమిన్స్ ఏంటీ.? అవి ఏయే ఫుడ్స్‌లో ఉండాలి.
? వంటి విషయాలను ఏ మాత్రం లేట్ చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.విటమిన్ ఎ.
కంటి ఆరోగ్యానికే ఉపయోగపడుతుందని చాలా మంది భావిస్తారు.కానీ, రోగ నిరోధక వ్యవస్థను బలపరచడంలోనూ విటమిన్ ఎ ఉపయోగపడుతుంది.
కాబట్టి, క్యారెట్, పాలకూర, క్యాప్సికమ్, చిలకడ దుంపలు, బొప్పాయి పండు, గుమ్మడి కాయ, గుమ్మడి గింజలు, బొక్రోలీ వంటి ఆహారాలను డైట్‌లో చేర్చుకుంటే విటమిన్ ఎ శరీరానికి పుష్కలంగా అందిస్తుంది.
"""/" /
విటమిన్ డిలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శరీరంలోని రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడంలో అద్భుతంగా సహాయపడతాయి.
అయితే విటమిన్ డి పొందాలంటే ఉదయం ఎండలో కాసేపు ఉండటంతో పాటు పుట్టగొడుగులు, గుడ్డు, చేపలు, రొయ్యలు, ఛీజ్ వంటి ఫుడ్స్‌ను ఆహారంలో భాగంగా చేసుకోవాలి.
ఇమ్యూనిటీ పవర్‌ను పెంచే మరో అద్భుతమైన విటమిన్ బి6.రక రకాల సీజనల్ వ్యాధులకు అడ్డు కట్ట వేసి రోగ నిరోధక వ్యవస్థను చురుగ్గా మార్చడంతో విటమిన్ బి 6 చాలా బాగా సహాయపడుతుంది.
సో.విటమిన్ బి6ను శరీరానికి అందించాలంటే అరటి పండు, అవకాడో, ఓట్స్, సోయా బీన్స్, వేరుశనగలు, పాలు, పిస్తా పప్పు, బాదం నూనె వంటి ఆహారాలను తీసుకోవాలి.
సిద్దు జొన్నలగడ్డ, బొమ్మరిల్లు భాస్కర్ ల పరిస్థితి ఏంటి..?