తారకరత్నకు.. ఆ రెండు మూవీస్ చాలా స్పెషల్ !

నందమూరి తారకరత్న గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తాజాగా కన్నుమూశారు.

ఆయన మరణవార్తతో సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ అయింది.నందమూరి వంశం నుంచి వచ్చిన ఈ హీరో కేవలం హీరోగానే కాకుండా ఆయా సినిమాల్లో స్పెషల్ రోల్స్ కూడా చేశారు.

అంతేకాకుండా విలన్ గాను చేసి మెప్పించారు.ఆయన కెరియర్ మొత్తంలో ఇప్పటివరకు 20కి పైగా సినిమాల్లో నటించి మెప్పించారు.

అయితే ఆయన నటించిన సినిమాలన్నిటిలోకెల్లా రెండు సినిమాలు మాత్రం ఆయన కెరియర్ లో చిరస్థాయిగా నిలిచిపోతాయని చెప్పవచ్చు.

ఆ రెండు సినిమాలు ఏవనగా " ఒకటో నెంబర్ కుర్రాడు, అమరావతి " ఈ రెండు మూవీస్ తారకరత్న కెరియర్ లో చాలా స్పెషల్ అని చెప్పవచ్చు.

ఆ సినిమాల విశేషాలు ఏంటో ఒకసారి చూద్దాం ! """/" / 2002 లో విడుదల అయిన ఒకటో నెంబర్ కుర్రాడు మూవీతో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు తారకరత్న.

నందమూరి వంశం నుంచి వస్తున్న హీరో కావడంతో ఈ సినిమాపై అప్పట్లో భారీ హైప్ నెలకొంది.

హైప్ కు తగ్గట్లుగానే మూవీ సాంగ్స్ సూపర్ హిట్ గా నిలిచాయి.ఏం ఏం కీరవాణి అందించిన ఈ మూవీ సాంగ్స్ అప్పట్లో ఒక సేన్సేషన్ సృష్టించాయి.

ఎక్కడ చూసిన కూడా ఈ మూవీ సాంగ్స్ మారుమ్రోగేవి.ఇక మూవీ మీద ఉన్న హైప్ కు తగ్గట్టుగానే.

విడుదల తరువాత ఈ మూవీ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.సున్నితమైన ప్రేమకథతో వచ్చిన ఈ మూవీని అప్పటి యూత్ బాగా ఆదరించారు.

ఈ మూవీకి కథ కె.రాఘవేంద్రరావు అందించగా కోదండ రామిరెడ్డి దర్శకత్వం వహించారు.

"""/" / ఇక తారకరత్న కెరియర్ లో ఎన్ని సినిమాలు ఉన్నప్పటికి 2009లో వచ్చిన అమరావతి మూవీ చాలా ప్రత్యేకమనే చెప్పాలి.

సైకో థ్రిల్లర్ గా వచ్చిన ఈ మూవీలో తారకరత్న చేసిన విలన్ రోల్ సినిమాకే మేజర్ హైలెట్ అని చెప్పవచ్చు.

తొలిసారిగా ఆయన విలన్ గా నటించినప్పటికి కూడా ఆ మూవీలో విలన్ పాత్రకు తారకరత్న తప్పా ఇంకెవరు సెట్ కారేమో అనెంతలా ఆ పాత్రకు ప్రాణం పోశారు తారకరత్న.

ఆ మూవీలో ఆయన చేసిన నటనకు గాను నంది అవార్డు కూడా గెలుచుకున్నారు.

చందు మొండేటి సూర్య కాంబో ఫిక్స్ అయినట్లేనా..?