హెయిర్ ఫాల్ ను అరికట్టి జుట్టును ఒత్తుగా మార్చడానికి ఇవి రెండు చాలు.. తెలుసా?

హెయిర్ ఫాల్ సమస్య పెరిగే కొద్దీ జుట్టు పల్చగా మారిపోతుంటుంది.అందుకే హెయిర్ ఫాల్‌ సమస్యను నివారించుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.

తోచిన చిట్కాలు పాటిస్తుంటారు.అయితే హెయిర్ ఫాల్ ను అరికట్టి జుట్టును ఒత్తుగా మార్చడానికి ఇప్పుడు చెప్పబోయే రెండు పదార్థాలు సరిపోతాయి.

మరి ఆ రెండు పదార్థాలు ఏంటి.? వాటిని ఎలా జుట్టుకు ఉపయోగించాలి.

? అన్నది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు మెంతులు, రెండు టేబుల్ స్పూన్లు డ్రై రోజ్ మేరీ వేసుకొని ఒక గ్లాస్‌ వాటర్ పోసి నైట్‌ అంతా నానబెట్టుకోవాలి.

మరుసటి రోజు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో నైట్ అంతా నానబెట్టుకున్న డ్రై రోజ్ మేరీ మరియు మెంతులను వాటర్ తో సహా వేసుకోవాలి.

అలాగే మరో కప్పు వాటర్ ను కూడా పోసి పది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు మరిగించాలి.

"""/"/ ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకుంటే హెయిర్ టోనర్ సిద్ధమవుతుంది.

ఈ హెయిర్ టోనర్ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక స్ప్రే బాటిల్ లో నింపుకోవాలి.

జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు ఒకటికి రెండుసార్లు హెయిర్ టోనర్ ను స్ప్రే చేసుకోవాలి.

రెండు గంటల అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

"""/"/ వారంలో ఒక్కసారి ఈ హెయిర్ టోనర్ ను కనుక వాడితే జుట్టు కుదుళ్లకు బలం చేకూరుతుంది.

దాంతో హెయిర్ ఫాల్ సమస్య క్రమంగా కంట్రోల్ అవుతుంది.అదే సమయంలో జుట్టుకు మంచి పోషణ అంది ఒత్తుగా పొడుగ్గా పెరుగుతుంది.

కాబట్టి ఎవరైతే హెయిర్ ఫాల్‌ సమస్యతో తీవ్రంగా సతమతం అవుతున్నారో.ఒత్తైన జుట్టును కావాలని ఆరాటపడుతున్నారో.

వారు కచ్చితంగా ఈ హెయిర్ టోనర్ ను వాడేందుకు ప్రయత్నించండి.

పర్ఫెక్షన్ కోసం కష్టపడుతున్న ప్రభాస్…కారణం ఏంటంటే..?