మృతకణాలను పోగొట్టి మృదువైన చర్మాన్ని అందించే ఉత్తమ చిట్కాలు ఇవి!

చర్మంపై పేరుకుపోయే మృత కణాలను( Dead Skin Cells ) ఎప్పటికప్పుడు తొలగించుకోవాలి.

లేదంటే చర్మం డల్ గా కాంతి హీనంగా కనిపిస్తుంది.చర్మ ఆరోగ్యం దెబ్బ తింటుంది ఈ నేపథ్యంలోనే మృత కణాలను పోగొట్టి మృదువైన మెరిసే చర్మాన్ని అందించడానికి సహాయపడే ఉత్తమ చిట్కాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

"""/" / H3 Class=subheader-styleరెమెడీ 1:/h3p ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి( Rice Flour ) వేసుకోవాలి.

అలాగే రెండు టేబుల్ స్పూన్లు టీ డికాషన్( Tea Decoction ) మరియు వన్ టేబుల్ స్పూన్ తేనె వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని ఇర‌వై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

ఆపై చర్మాన్ని వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.వారానికి రెండు సార్లు ఈ సింపుల్ రెమెడీని పాటించడం వల్ల చనిపోయిన చర్మ కణాలు తొలగిపోవడమే కాకుండా చర్మం మృదువుగా కాంతివంతంగా మారుతుంది.

చర్మంపై అధిక ఆయిల్ ఉత్పత్తి తగ్గుతుంది. """/" / H3 Class=subheader-styleరెమెడీ 2:/h3p మిక్సీ జార్ లో నాలుగు కిరా దోసకాయ( Cucumber ) స్లైసెస్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్లు మిల్క్ పౌడర్,( Milk Powder ) వన్ టీ స్పూన్ పెరుగు, చిటికెడు పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని ప‌దిహేను లేదా ఇర‌వై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

ఆపై తడి వేళ్ల‌తో చర్మాన్ని సున్నితంగా స్క్రబ్బింగ్ చేసుకుంటూ వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.

ఈ రెమెడీని పాటించిన‌ కూడా మృత కణాలు తొలగిపోతాయి.చర్మం మృదువుగా కోమలంగా మారుతుంది.

పైగా కీరా చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది.డ్రై స్కిన్ తో బాధపడే వారికి ఈ రెమెడీ చాలా బాగా సెట్ అవుతుంది.

కాబ‌ట్టి, త‌ప్ప‌కుండా ట్రై చేయండి.

బాబాయ్ వల్ల నాన్న బెల్ట్ తో కొట్టారు.. రామ్ చరణ్ సంచలన వ్యాఖ్యలు వైరల్!