షుగర్ లెవెల్స్ ను కంట్రోల్లో ఉంచుకోవడం కష్టంగా మారుతుందా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!

ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా కోట్లాది మంది షుగర్ వ్యాధి లేదా మ‌ధుమేహంతో బాధపడుతున్నారు.

ఇదేమీ అంత చిన్న సమస్య ఏమీ కాదు.పొరపాటున షుగర్ వ్యాధిని నిర్లక్ష్యం చేశారంటే శరీరంలో మొత్తం అవయవాలపై ప్రభావం పడుతుంది.

అందుకే మధుమేహం ఉన్న వారు చక్కెర స్థాయిలను నియంత్రించుకునేందుకు ముప్ప తిప్పలు పడుతుంటారు.

అయితే కొందరికి షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ లో ఉంచుకోవడం చాలా కష్టత‌రంగా మారుతుంటుంది.

"""/" / అలాంటివారు సింపుల్ టిప్స్ ను ఫాలో అయితే ఈజీగా షుగర్ ను అదుపులో ఉంచుకోవచ్చు.

మరి ఇంతకీ ఆ టిప్స్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.మెంతులు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి అద్భుతంగా సహాయపడతాయి.

ఉదయం మెంతులు మరిగించిన నీటిని తీసుకోవచ్చు.లేదా భోజనం తర్వాత కొన్ని మెంతులను నమిలి తినొచ్చు.

ఇలా రోజు చేస్తే షుగర్ ను కంట్రోల్ చేసుకోవడం చాలా సులభతరం అవుతుంది.

అలాగే డైట్ లో ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.తద్వారా రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ ఒక్కసారిగా పెరగకుండా ఉంటాయి.

మధుమేహం ఉన్నవారికి అలోవెరా జ్యూస్ ఒక వరం అని చెప్పుకోవచ్చు.వారానికి రెండుసార్లు అలోవెరా జ్యూస్ ను తీసుకుంటే షుగర్ లెవెల్స్ ఎంత హెవీగా ఉన్నా కూడా దెబ్బకు కంట్రోల్ లోకి వస్తాయి.

"""/" / రోజుకు ఒక కప్పు దాల్చిన చెక్క టీ ను తీసుకునేందుకు ప్రయత్నించండి.

ఎందుకంటే చ‌క్కెర స్థాయిల‌ను నియంత్రించ‌డానికి దాల్చిన చెక్క గ్రేట్ గా హెల్ప్ చేస్తుంది.

షుగ‌ర్స్‌ మరియు కార్బోహైడ్రేట్స్ ఉండే ఆహారాలను చాలా మితంగా తీసుకోండి.మరియు నిత్యం అర గంట పాటు ఏదో ఒక వ్యాయామం చేయండి.

కనీసం వాకింగ్ చేసినా కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.షుగ‌ర్ లెవ‌ల్స్ తో పాటు బాడీ వెయిట్ సైతం అదుపులో ఉంటుంది.

నేను ఏ పరిస్థితి లో ఉన్న ఆ ముగ్గురు ఫోన్ లిఫ్ట్ చేస్తారు : కమెడియన్ సుధాకర్