పిల్ల‌ల్లో కాల్షియం లోపానికి చెక్ పెట్టాలంటే ఈ మూడు ఆహారాలు చాలు!

కాల్షియం లోపం.కోట్లాది మంది పిల్ల‌ల్లో క‌నిపించే కామ‌న్ స‌మ‌స్య ఇది.

పిల్ల‌ల్లో కాల్షియం లోపం ఏర్ప‌డ‌టం వ‌ల్ల వారి ఎదుగుద‌ల దెబ్బ తింటుంది.ఎముక‌ల సాంద్ర‌త త‌గ్గిపోతుంది.

ఎప్పుడూ నీర‌సంగా క‌నిపిస్తుంటారు.అలాగే మ‌రెన్నో స‌మ‌స్య‌లు సైతం వారిలో తలెత్తుతాయి.

అందుకే పిల్ల‌ల్లో ఏర్ప‌డ్డ కాల్షియం లోపాన్ని పొర‌పాటున కూడా నిర్ల‌క్ష్యం చేయ‌కూడ‌దు.వెంట‌నే కాల్షియం కొర‌త‌ను పూడ్చేందుకు ప్ర‌య‌త్నించాలి.

అయితే అందుకు ఇప్పుడు చెప్ప‌బోయే మూడు ఆహారాలు అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.మ‌రి ఆ ఆహారాలు ఏంటో ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

బాదం ప‌ప్పు.పిల్ల‌ల్లో కాల్షియం లోపానికి చెక్ పెట్ట‌డానికి సూప‌ర్ గా హెల్ప్ చేస్తుంది.

బాదం ప‌ప్పులో కాల్షియంతో పాటు మ‌రెన్నో పోష‌కాలు నిండి ఉంటాయి.వీటిని నీటిలో నైటంతా నాన‌బెట్టి ఉద‌యాన్నే పిల్లల చేత తినిపించాలి.

ఇలా రోజుకు నాలుగు బాదం ప‌ప్పుల‌ను పిల్ల‌ల‌కు ఇస్తే కాల్షియం లోపం నుంచి వారు బ‌య‌ట ప‌డ‌తారు.

ఎముక‌లు, కండ‌రాలు దృఢంగా పెరుగుతాయి.బాదం పిల్ల‌ల మానసిక ఎదుగుల‌ను సైతం పెంచుతుంది.

అలాగే నువ్వులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.వివిధ ర‌కాల జ‌బ్బుల‌ను నివారించ‌డంలో ఇవి గ్రేట్‌గా స‌హాయ‌ప‌డ‌తాయి.

కాల్షియం కొర‌త‌ను పూడ్చే శ‌క్తీ వీటికి ఉంది.పిల్ల‌ల‌కు నువ్వుల‌ను వ‌న్ టేబుల్ స్పూన్ చ‌ప్పున ప్ర‌తి రోజు ఏదో ఒక రూపంలో ఇస్తే వారిలో కాల్ష‌యం లోపం స‌మ‌స్య క్ర‌మంగా త‌గ్గిపోతుంది.

"""/" / జున్ను.ఎంత టేస్ట్‌గా ఉంటుందో అంతే ఎక్కువ పోష‌కాల‌ను క‌లిగి ఉంటుంది.

ముఖ్యంగా జున్నులో కాల్షియం కంటెంట్ స‌మృద్ధింగా నిండి ఉంటుంది.అందువ‌ల్ల‌, పిల్ల‌ల‌కు వారంలో క‌నీసం రెండు సార్లు అయినా జున్నును పెడితే.

కాల్షియం లోపం త‌గ్గి వారు యాక్టివ్‌గా మ‌రియు హెల్తీగా మార‌తారు.

అభివృద్ధికి ఏకైక గ్యారంటీ ఎన్డీఏ..: మోదీ