బాహుబలి తో పోల్చి చూస్తే.. త్రిబుల్ ఆర్ సినిమా లో కొన్ని అంశాలు మిస్ అయ్యాయట?
TeluguStop.com
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా భారతీయ చలన చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడుకోవాలంటే ముందుగా బాహుబలి సినిమా గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు.
ఎందుకంటే ఆ సినిమా సృష్టించిన రికార్డులు అలాంటివి.అయితే ఒకప్పుడు భారత సినిమా అంటే కేవలం బాలీవుడ్ సినిమాలను మాత్రమే పరిగణించే వారు.
కానీ బాహుబలి తర్వాత తెలుగు సినిమాకి ఆ స్థాయి గౌరవాన్ని తెచ్చి పెట్టారు దర్శకుడు రాజమౌళి.
బాహుబలి లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత ఇక ఇటీవల ఇద్దరు హీరోలతో త్రిబుల్ ఆర్ సినిమా తెరకెక్కించాడు.
అయితే బాహుబలి తో పోల్చితే త్రిబుల్ ఆర్ సినిమాలో మాత్రం కొన్ని అంశాలు మిస్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
అవేంటో చూద్దాం.బాహుబలి 2 పార్ట్ ల విడుదల విషయంలో ఎలాంటి గందరగోళం లేదు.
అనుకున్న సమయానికి విడుదల అయ్యాయి.కానీ త్రిబుల్ ఆర్ సినిమా మాత్రం కరోనా వైరస్ కారణంగా విడుదల వాయిదా పడుతూ ప్రేక్షకులందరికీ కూడా కాస్త చిరాకు తెప్పించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
ఇక ఆలస్యం కావడం వల్ల బడ్జెట్ కూడా ఒకవైపు పెరిగిపోయింది. """/" /
ఇక బాహుబలి సినిమా రిలీజ్ అయిన సమయంలో ఓటిటి హవా అస్సలు లేదు.
దీంతో ఇక సినిమా చూడడానికి ప్రేక్షకులకు థియేటర్ ఒకటే అప్షన్.కానీ ఇప్పుడు మాత్రం సినిమా విడుదలైన నెల రోజుల్లో ఓటీటి లోకి వస్తూ ఉండటంతో ఇక మెల్లిగా చూద్దాంలే అని ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడం లేదు.
బాహుబలి సినిమా సమయంలో బుక్ మై షో లాంటి యాప్స్ అందుబాటులో ఉన్నాయి.
త్రిబుల్ ఆర్ సమయంలో టిక్కెట్ ధరలను పెంచే సరికి ఇక బుక్ మై షో టికెట్స్ బ్లాక్ చేసి మరీ ఎక్కువ ధరకు అమ్ముకునే వాళ్ళు ఎక్కువైపోయారు.
ఎంతో మంది ఎక్కువ ధరలు పెరగటంతో సినిమా చూసేందుకు వెళ్లడానికి కాస్త వెనకడుగు వేస్తున్నారు.
"""/" /
ఇక బాహుబలి సినిమాలో అప్పటికే దేశమంతటా పాపులర్ అయిన రానా విలన్ గా నటించడం కలిసి వచ్చింది.
కాని త్రిబుల్ ఆర్ సినిమాలో విలన్ గా నటించిన వ్యక్తి ఇండియన్స్ కి తప్ప పెద్దగా ఎవరికీ తెలియదు.
ఇక బాహుబలి సినిమాలో అనుష్క తమన్నా లాంటి గ్లామర్ రోల్స్ ఉన్నాయి.ఇద్దరు హీరోయిన్లు కూడా తమ గ్లామర్ తో అందరిని మెస్మరైజ్ చేశారు.
త్రిబుల్ ఆర్ సినిమాలో మాత్రం నాటు అనే పాట తప్ప మిగతా ఏ పాటలు ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు.
"""/" /
ఇక బాహుబలి సినిమాలో ఎన్నో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి.త్రిబుల్ ఆర్ సినిమా లో మాత్రం దేశభక్తి ఆధారంగా తెరకెక్కిన సినిమా.
దీంతో బాహుబలి లాగా ఈ సినిమా కు రిపీట్ ఆడియన్స్ వచ్చే అవకాశం కూడా తక్కువగా ఉంటుందట.
ఇలా బాహుబలి తో పోలిస్తే త్రిబుల్ ఆర్ లో కొన్ని అంశాలు మిస్ అయ్యాయి అంటూ టాక్ వినిపిస్తోంది?.
ఈ జాగ్రత్తలు తీసుకుంటే అలసట అల్లాడిపోవాల్సిందే!