వారంలో ఒక్క‌సారి ఈ ప్యాక్ ట్రై చేస్తే జుట్టు సూప‌ర్‌గా పెరుగుతుంద‌ట‌!

హెయిర్ ఫాల్‌.నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుషుల్లోనే కాకుండా చిన్న పిల్ల‌ల్లోనూ ఈ స‌మ‌స్య చాలా కామ‌న్‌గా క‌నినిస్తుంది.

మారిన జీవ‌న శైలి, ఆహార‌పు అల‌వాట్లు, పోష‌కాల కొర‌త‌, వాతావ‌రణంలో వ‌చ్చే మార్పులు, కాలుష్యం, కెఫీన్ అధికంగా తీసుకోవ‌డం, మ‌ద్యం అల‌వాటు.

ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల హెయిర్ స‌మ‌స్య‌ను ఎదుర్కొంటుంటారు.అయితే కార‌ణం ఏదైనప్ప‌టికీ.

హెయిర్ ఫాల్‌కి అడ్డు క‌ట్ట వేయ‌డం కోసం నానా ప్ర‌య‌త్నాలు మ‌రియు ప్ర‌యోగాలు చేస్తుంటారు.

ఈ క్ర‌మంలోనే వేల‌కు వేలు ఖ‌ర్చు పెట్టి ఖ‌రీదైన షాంపూలు, హెయిర్ ఆయిల్స్ కొనుగోలు చేసి వాడుతుంటారు.

కానీ, ఎలాంటి ఖ‌ర్చు లేకుండా ఇంట్లోనే ఒక సింపుల్ అండ్ సూప‌ర్ హెయిర్ ప్యాక్‌ను ట్రై చేస్తే గ‌నుక‌.

కేవ‌లం కొద్ది రోజుల్లోనే హెయిర్ ఫాల్ స‌మ‌స్య‌కు గుడ్ బై చెప్పేయ వ‌చ్చు.

మ‌రి ఆ సూప‌ర్ హెయిర్ ప్యాక్ ఏంటో ఏ మాత్రం లేట్ చేయ‌కుండా ఓ లుక్కేసేయండి.

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు స్పూన్ల బియ్యం, రెండు స్పూన్ల క‌లోంజి సీడ్స్‌, రెండు స్పూన్ల మెంతులు, ఒక క‌ప్పు వాట‌ర్ పోసి మూడు లేదా నాలుగు గంట‌ల‌ పాటు నాన బెట్ట‌కోవాలి.

"""/"/ ఆ త‌ర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో నాన బెట్టుకున్న బియ్యం, క‌లోంజి, మెంతులను వేసి క‌చ్చా ప‌చ్చాగా పేస్ట్ చేసుకోవాలి.

"""/"/ ఆ త‌ర్వాత అందులో క‌ట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లి పాయ ముక్క‌లు, ఒక స్పూన్ ఉసిరి కాయ పొడి, ఒక స్పూన్ ఆముదం వేసుకుని మెత్త‌గా పేస్ట్ చేశాకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివ‌ర్ల వ‌ర‌కు ప‌ట్టించి ష‌వ‌ర్ క్యాప్ పెట్టుకోవాలి.

గంట అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో త‌ల స్నానం చేయాలి.ఈ ప్యాక్‌ను వారం ఒకే ఒక్క సారి ట్రై చేస్తే గ‌నుక‌.

క్ర‌మంగా హెయిర్ ఫాల్ త‌గ్గి.ఒత్తుగా, పొడ‌వుగు జుట్టు పెరుగుతుంది.

మ‌రియు జుట్టు రాల‌డం, చిట్ల‌డం, చుండ్రు వంటి స‌మ‌స్య‌లు సైతం దూరం అవుతాయి.

కేసీఆర్ యాత్రకు భద్రత కల్పించాలి.. సీఈవోకి బీఆర్ఎస్ విజ్ఞప్తి