అధిక రక్తపోటుతో బాధపడుతున్నారా.. ఈ సూపర్ ఫుడ్స్ తో చెక్ పెట్టండి!
TeluguStop.com
అధిక రక్తపోటు( High Blood Pressure ).మనలో చాలా మంది కామన్ గా ఫేస్ చేసే సమస్యల్లో ఇది ఒకటి.
అధిక రక్తపోటును హైపర్ టెన్షన్ లేదా హైబీపీ అని కూడా పిలుస్తారు.కంటి నిండా నిద్ర లేకపోవడం, ఉప్పు అధికంగా తీసుకోవడం, ధూమపానం, మద్యపానం, అధిక శరీర బరువు తదితర అంశాలు రక్తపోటును ప్రభావితం చేస్తాయి.
తలనొప్పి, నిద్రలేమి, చూపు మసక బారడం, విపరీతమైన అలసట, చెవుల్లో రింగుమని శబ్దాలు రావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గుండె దడ వంటివి అధిక రక్తపోటు యొక్క లక్షణాలు.
"""/" /
వీటిని నిర్లక్ష్యం చేయకుండా జీవన శైలిలో పలు మార్పులు మరియు కొన్ని ఇంటి చిట్కాలను పాటిస్తే సులభంగా అధిక రక్తపోటుకు చెక్ పెట్టవచ్చు.
మొదట ధూమపానం, మద్యపానం అలవాట్లను వదులుకోవాలి.కంటినిండా నిద్ర ఉండేలా చూసుకోవాలి.
ఒత్తిడికి వీలైనంత వరకు దూరంగా ఉండాలి.ప్రతినిత్యం అరగంట పాటు వ్యాయామం చేయాలి.
బయటీ ఆహార పదార్ధాల జోలికి వెళ్లకుండా ఉండాలి.కారం, ఉప్పు వాడకం చాలా వరకు తగ్గించాలి.
డైట్ లో మాంసాహారాలు కాకుండా కూరగాయలు ఆకుకూరలు తాజా పండ్లు ఉండేలా చూసుకోండి.
"""/" /
ఇకపోతే దాల్చిన చెక్క హైబీపీని కంట్రోల్ చేయడంలో ఒక సూపర్ ఫుడ్ గా పని చేస్తుంది.
ప్రతినిత్యం ఒక గ్లాస్ వాటర్ లో పావు టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి ( Cinnamon Powder ) కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
అలాగే యాలకులు కూడా అధిక రక్తపోటుకు చెక్ పెట్టగలవు.అందుకోసం రోజూ రెండు యాలకులను నోట్లో వేసుకుని నమిలి తినేయండి.
అధిక రక్తపోటును కంట్రోల్ చేసే సామర్థ్యం అవిసె గింజలకు( Flax Seeds ) ఉంది.
రోజుకు వన్ టేబుల్ స్పూన్ అవిసె గింజలను ఏదో ఒక రూపంలో తీసుకుంటే హై బీపీకి బై బై చెప్పవచ్చు.
ఇక రోజుకి ఒకటి లేదా రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలను తింటే రక్తపోటు అదుపులోకి రావడమే కాకుండా కొలెస్ట్రాల్ సైతం కరుగుతుంది.
ఎప్పుడు వచ్చామని కాదమ్మా.. రికార్డ్స్ బద్దలయ్యా లేదా (వీడియో)