వేసవిలో దొరికే ఈ పండ్లు బరువును తగ్గిస్తాయని మీకు తెలుసా?
TeluguStop.com
నేటి రోజుల్లో అధిక బరువు అనేది కోట్లాది మందిని తీవ్రంగా కలవర పెడుతోంది.
ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో చోటుచేసుకున్న మార్పులు, పోషకాల లోపం, శరీరానికి శ్రమ లేకపోవడం వంటి కారణాల వల్ల వెయిట్ గెయిన్ అవుతుంటారు.
బరువు పెరిగే కొద్దీ వివిధ రకాల జబ్బులు వచ్చే రిస్క్ కూడా పెరుగుతుంది.
అందుకే వెయిట్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవడం ఎంతో అవసరం.ఇక ప్రస్తుతం వేసవి కాలం ప్రారంభమైంది.
ఎండలు మెల్ల మెల్లగా ముదురుతున్నాయి.అయితే ఈ సీజన్‌లో విరి విరిగా దొరికే కొన్ని పండ్లు బరువును తగ్గించడానికి అద్భుతంగా సహాయపడతాయి.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ పండ్లు ఏంటో తెలుసుకుందాం పదండీ.సమ్మర్ సీజన్ వచ్చిందంటే చాలు ఎక్కడ పడితే అక్కడ పుచ్చకాయలు దర్శనమిస్తుంటాయి.
వేసవి తాపాన్ని తీర్చడానికి, నీరసం అలసట వంటి సమస్యలను నివారించడానికి సహాయపడే పుచ్చకాయ.
శరీర బరువును సైతం తగ్గిస్తుంది.అవును, రోజుకు ఒక కప్పు పుచ్చకాయ ముక్కలు తింటే ఎక్కువ సమయం పాటు కడుపు నిండిన భావన కలుగుతుంది.
అతి ఆకలి తగ్గుతుంది.దాంతో చిరు తిండ్లపై మనసు మల్లకుండా ఉంటుంది.
ఫలితంగా బరువు తగ్గుతారు.లిచీ.
వేసవిలో దొరికే పండ్లలో ఇది ఒకటి. """/"/ ఎర్రగా నిగనిగలాడుతూ అందంగా కనిపించే లిచీ పండ్లను తరచూ తీసుకుంటే సూపర్ ఫాస్ట్‌గా వెయిట్ లాస్ అవుతారు.
జీవక్రియ మెరుగుపడుతుంది, రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది.మరియు రక్త హీనత సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.
సమ్మర్‌లో విరి విరిగా దొరికే బొప్పాయి పండుతోనూ వెయిట్ లాస్ అవ్వొచ్చు.బొప్పాయి పండును డైట్‌లో చేర్చుకుంటే.
అందులోని ఫైబర్ కంటెంట్ ఆకలిని నియంత్రించి బరువు తగ్గేలా చేస్తుంది.అలాగే శరీరాన్ని యాక్టివ్‌గా ఎనర్జిటిక్‌గా మారుస్తుంది.
మరియు బొప్పాయి తింటే డీహైడ్రేషన్ బారిన పడకుండా కూడా ఉంటారు.ఇక ఇవే కాకుండా పైనాపిల్, బెర్రీ పండ్లు తీసుకున్నా బరువు తగ్గుతారు.
నేను చేసిన తప్పు నిజ జీవితంలో మీరు ఎవరు చేయొద్దు… అభిమానులను వేడుకున్న సూర్య!