Nithyananda Swami: నిత్యానంద స్వామీజీ కైలాసానికి ప్రధానిగా ఒకప్పటి హీరోయిన్.. ఎవరో తెలుసా?

మామూలుగా సినిమాలకు రాజకీయాలకు చాలా దగ్గర సంబంధం ఉందని చెబుతూ ఉంటారు.ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతోమంది రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చి రాణించిన విషయం తెలిసిందే.

కానీ కొంతమందికి రాజకీయాలు సెట్ కాకపోవడంతో మళ్లీ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు.

అలా ఇప్పటికే ఎంతోమంది ఏ సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయాలలోకి రంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే.

ముఖ్యమంత్రులుగా అలాగే ఎంపీలు, ఎమ్మెల్యే లుగా కూడా రాణిస్తున్నారు.నందమూరి తారక రామారావు( Nandamuri Taraka Rama Rao ) టీడీపీ పార్టీని స్థాపించి సీఎం అయ్యారు.

"""/" / MGR, జయలలిత వంటి వారు తమిళ రాజకీయాలను శాసించారు.రోజా మంత్రిగా, బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నారు.

పవన్ కళ్యాణ్, కమల్ హాసన్ వంటి సినీ ప్రముఖులు సొంత పార్టీలు పెట్టుకొని పోటీకి సిద్దమవుతున్నారు.

రజినీ కాంత్ రాజకీయాల నుండి తప్పుకున్న సంగతి తెలిసిందే.చిత్ర పరిశ్రమకు చెందిన వారు ముఖ్యమంత్రులు అయ్యారు.

కానీ ఇప్పటి వరకు ఎవరూ కూడా ప్రధాన మంత్రిగా చేయలేదు.ఇప్పుడీ అరుదైన ఘనత సాధించబోతుంది ఒకప్పటి నటి.

ఆ నటి ఎవరు? ఏంటి అన్న వివరాల్లోకి వెళితే.భారతదేశ ప్రజలకు నిత్యానంద స్వామి( Nithyananda Swami ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

"""/" / స్వామిగా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.ఈయన దేశం విడిచి పరారైన సంగతి అందరికి తెలిసిందే.

భారతదేశాన్ని విడిచిపెట్టి, మరో దేశాన్ని సృష్టించుకున్నాడు.ఆ దీవిని తాను ఏలుతునట్లు ప్రకటించుకున్నాడు.

ఆ దీవికి కైలాస దేశం( Kailasam ) అనే పేరును కూడా గతంలోనే ప్రకటించాడు.

తాజాగా ఆయన ప్రియ శిష్యురాలైన మాజీ నటి రంజితను( Actress Ranjitha ) ఆ దేశానికి ప్రధానిని చేశారు.

దానికి సంబంధించిన ప్రకటన గురించి ఒక తమిళ పత్రిక కథనాన్ని విడుదల చేసింది.

దీంతో మరోసారి నిత్యానంద స్వామి వార్తల్లో నిలిచాడు.నిత్యానంద వెబ్‌సైట్‌లోను కైలాస ప్రధాని గురించి ప్రకటన చేయడం కలకలం రేపుతోంది.

వెబ్‌సైట్‌లో ఫోటో కింద నిత్యనంద స్వామి అని పేరు ఉంది.ఈ మధ్యనే ఐక్యరాజ్య సమితి సమావేశంలో కూడా కైలాస దేశం తరఫున మహిళ రాయబారులతో కలిసి హాజరయ్యారాయన.

ఈ నేపథ్యంలోనే నటి రంజిత కూడా కైలాస దేశ ప్రధానిగా త్వరలోనే ఐక్యరాజ్యసమితి సమావేశానికి హాజరయ్యే అవకాశముందని తెలుస్తోంది.

మరోమారు కొంప ముంచిన గూగుల్‌ మ్యాప్స్‌.. లోయలోకి దూసుకెళ్లిన భారీ కంటైనర్..