గుండె జబ్బులను దూరం చేసే బెస్ట్ మసాలా దినుసులు ఇవే!
TeluguStop.com
ప్రతి సంవత్సరం గుండె జబ్బులతో కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు.ఒకప్పుడు అరవై, డెబ్బై ఏళ్లు దాటిన తర్వాత వచ్చే గుండె జబ్బులు నేటి కాలంలో చిన్న వయసులోనే వస్తున్నాయి.
అధిక రక్తపోటు, డయాబెటిస్, ఆహారపు అలవాట్లు, ధూమపానం ఇలా రకరకాల కారణాల వల్ల గుండె జబ్బుల బారిన పడుతున్నారు.
అయితే కొన్ని కొన్ని ఆహారాలు గుండె జబ్బులను నివారించడంలో అద్భుతంగా సహాయపడతాయి.ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే మసాలా దినుసులు గుండె సంబంధిత జబ్బుల నుంచి రక్షించడంలో సూపర్‌గా హెల్ప్ అవుతాయి.
మరి ఆ మసాలా దినుసులు ఏంటీ అన్నది ఆలస్యం చేయకుండా ఓ లుక్కేసేయండి.
దాల్చిన చెక్క.బిర్యానీలతో పాటు పలు రకాల వంటల్లో కూడా దీనిని ఉపయోగిస్తున్నారు.
మంచి రుచి, సువాసన కలిగి ఉండే దాల్చిన చెక్కతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఉన్న దాల్చిన చెక్క ఏదో ఒక రూపంలో తీసుకుంటే.
రక్తప్రసరణ వ్యవస్థలో కలిగే ఆటంకాలను తొలిగించడంతో పాటు గుండె జబ్బుల నుంచి రక్షణ కల్పిస్తుంది.
"""/" /
వాము ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.వామును రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవడం వల్ల.
అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది.అలాగే వాములో ఉండే పొటాషియం, క్యాల్షియం మరియు ఇతర పోషకాలు గుండె జబ్బులు వచ్చే రిస్క్‌ను తగ్గిస్తుంది.
ఘాటైన రుచి, వాసన కలిగి ఉండే లవంగాలు కూడా గుండె ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడతాయి.
కనీసం రోజుకు ఒక లవంగం తీసుకోవడం వల్ల బీపీ కంట్రోల్‌లో ఉండడంతో పాటు గుండె జబ్బులు కూడా దూరంగా ఉంటాయి.
అలాగే మిరియాలు కూడా గుండె సంబంధిత సమస్యలను నివారించగలవు.మిరియాలు ప్రతి రోజు ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల.
రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది.మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
ఫలితంగా గుండె జబ్బుల నుంచి రక్షణ లభిస్తుంది.
ఈ ఇయర్ లో భారీ విజయాలను సాదించిన టాప్ 3 ఇండియన్ సినిమాలు ఇవేనా..?