కాలి మడమల నలుపు పోవాలా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!
TeluguStop.com
సాధారణంగా చాలా మందికి పాదాలు తెల్లగా ఉన్న కూడా కాలి మడమలు(చీలమండలు) మాత్రం నల్లగా అసహ్యంగా కనిపిస్తుంటాయి.
కాలి మడమల నలుపు( Dark Ankles ) కారణంగా పాదాలు అందవిహీనంగా మారతాయి.
ఈ క్రమంలోనే మడమల నలుపును వదిలించుకునేందుకు కొందరు ప్రయత్నిస్తూ ఉంటారు.అయితే అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే సింపుల్ టిప్స్ చాలా అద్భుతంగా సహాయపడతాయి.
H3 Class=subheader-styleటిప్ -1:/h3p ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు పంచదార, ( Sugar ) వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్( Coconut Oil ) వేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని అర నిమ్మ చెక్కతో తీసుకుని డార్క్ యాంకిల్స్ పై అప్లై చేసి కనీసం ఐదు నిమిషాల పాటు సున్నితంగా స్క్రబ్బింగ్ చేసుకోవాలి.
ఆపై వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.రెండు రోజులకు ఒకసారి ఈ సింపుల్ చిట్కాను పాటించడం ద్వారా నలుపు క్రమంగా మాయామై చీలమండలు తెల్లగా మారతాయి.
"""/" /
H3 Class=subheader-styleటిప్ -2:/h3p ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి,( Rice Flour ) వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్,( Lemon Juice ) హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు మరియు సరిపడా ఫ్రెష్ పొటాటో జ్యూస్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని మడమలతో పాటు పాదాలు మొత్తానికి అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.
అనంతరం చేతివేళ్లతో పాదాలు మడమలను స్క్రబ్బింగ్ చేసుకుంటూ వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.
ఈ సింపుల్ చిట్కాను తరచూ పాటిస్తే చీలమండల నలుపు పోవడమే కాకుండా పాదాలు తెల్లగా మృదువుగా సైతం మారతాయి.
"""/" /
H3 Class=subheader-styleటిప్-3: /h3pఅర నిమ్మ చెక్కను తీసుకుని దానిపై హాఫ్ టీ స్పూన్ వైట్ టూత్ పేస్ట్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా మరియు హాఫ్ టీ స్పూన్ తేనె వేసి నేరుగా చీలమండలకు మరియు పాదాలకు అప్లై చేసుకొని బాగా రుద్దాలి.
కనీసం రెండు నుంచి ఐదు నిమిషాల పాటు రబ్బింగ్ చేసిన అనంతరం వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.
ఇలా చేసిన కూడా నలుపు పోతుంది.పాదాలు అందంగా కాంతివంతంగా మారతాయి.
పెళ్లి వేడుకలో ఊహించని ట్విస్ట్.. వరుడి ఫ్రూటీలో రమ్ము కలిపిన స్నేహితుడు.. తర్వాతేమైందో మీరే చూడండి!