మద్యం లో ఇవి కలిపి అస్సలు త్రాగకూడదు.. అలా త్రాగితే చాలా ప్రమాదం..

ప్రపంచవ్యాప్తంగా మగవారే కాకుండా ఆడవారు కూడా మద్యాన్ని సేవిస్తున్నారు.మద్యపానం ఆరోగ్యానికి హానికరమని ప్రతి సినిమాలో యాడ్ ల రూపంలో చూపిస్తూనే ఉంటారు.

కానీ మద్యపానం చేయాలనుకున్నవారు ఇవన్నీ ఏమి పట్టించుకోరు.మద్యం హద్దులకు మించి తాగి వారి ఆరోగ్యాలను నాశనం చేసుకుంటున్నారు.

అలా కొంతమంది మధ్యపానం చేయడం వల్ల కొన్ని కుటుంబాలే రోడ్డున పడ్డాయి.

ఎంతోమంది మద్యపానం చేయవద్దు అని చెబుతున్న వినకుండా అతిగా మద్యపానం చేసి ఆసుపత్రుల పాలవుతుంటారు.

మద్యపానం చేయడం ఆరోగ్యానికి హానికరం అని ఆ బాటిల్స్ పైనే రాసిన స్టిక్కర్ ను మద్యం సేవించే వారికి కనిపించేలా చేసి ఉంచుతారు.

కొంతమంది మద్యం సేవించేవారు మద్యంతో పాటు సోడా లేదా కూల్ డ్రింక్స్ లను కలిపి సేవిస్తూ ఉంటారు.

ఇలా సేవించడం ఆరోగ్యానికి చాలా ప్రమాదమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.మద్యంతో పాటు సోడాను కలిపి తీసుకుంటే ఆరోగ్యంపై చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి.

ఇలా మద్యపానం చేయడం వల్ల మన శరీరంలో నీ రక్తంలోకి కార్బన్ డయాక్సైడ్ ఎక్కువగా వెళ్లి చేరుతుంది.

దీనివల్ల మన శరీరంలోని కాల్షియం శాతం తగ్గి ఎముకలు బలహీనపడతాయి.ఇలా మద్యం సేవించే వారు ఎముకులకు సంబంధించిన వ్యాధుల భారిన పడుతారు.

మద్యంతోపాటు శీతల పానీయాలను కలిపి తీసుకుంటే అలా మద్యం తీసుకునే వారి ఆరోగ్యాలపై దుష్ప్రభావాలు ఏర్పడతాయి.

ఆ శీతల పానీయాలలో ఎక్కువగా చక్కెర ఉంటుంది.కాబట్టి మద్యం ఇలా సేవించే వారి శరీరాలని నీరసంగా మారుస్తుంది.

అంతేకాకుండా ఇలా మద్యం సేవించేవారి శరీరం త్వరగా డిహైడ్రేట్ అయిపోతుంది.అందువలన ఇప్పటివరకు మద్యం సేవిస్తున్న వారు మద్యానికి దూరంగా ఉండటమే ఆరోగ్యానికి చాలా మంచిది.

మద్యం మన పూర్వీకుల నుంచే చెడు అలవాటు అని చాలామంది దానికి దూరంగా ఉంటూ వస్తున్నారు.

హైదరాబాద్ పరిధిలో తనిఖీలు.. భారీగా గంజాయి స్వాధీనం..!