తలనొప్పి తరచూ విసిగిస్తుందా.. మందులక్కర్లేదు ఈ గింజలతో చెక్ పెట్టండి!

తలనొప్పి( Headache ).అత్యంత సర్వసాధారణంగా ఇబ్బంది పెట్టే సమస్యల్లో ఒకటి.

ఇటీవల కాలంలో క్షణం తీరిక లేకుండా దాదాపు ప్రతి ఒక్కరూ ఉరుకుల పరుగుల జీవితాన్ని గడుపుతున్నారు.

ఇలాంటి బిజీ లైఫ్ స్టైల్ లో ఎప్పుడో ఒకప్పుడు తలనొప్పి మదన పెట్టడం కామనే.

కానీ కొందరిని మాత్రం తలనొప్పి త‌ర‌చూ విసిగిస్తూనే ఉంటుంది.తలనొప్పి అనేది చిన్న సమస్యే అయినప్పటికీ.

దాని వల్ల తీవ్ర అసౌకర్యానికి గురవుతుంటారు.తలనొప్పిగా ఉన్నప్పుడు ఏ పని పైన దృష్టి పెట్టలేరు.

ఈ క్రమంలోనే తలనొప్పి నుంచి బయటపడేందుకు పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు.కానీ ఇలాంటి మందులు అవసరం లేదు.

ఇప్పుడు చెప్పబోయే గింజలను తీసుకుంటే సహజంగానే తలనొప్పికి చెక్ పెట్ట‌వ‌చ్చు.ఇంతకీ ఆ గింజలు మరేవో కాదు సబ్జా గింజలు.

చాలా మంది చియా గింజలు సబ్జా గింజలు ఒకటే అని భావిస్తుంటారు.చూడడానికి ఒకేలా కనిపించినా.

రెండు వేరు వేరు.‌ఇకపోతే సబ్జా గింజల్లో పోషకాలు మెండుగా ఉంటాయి.

సబ్జా గింజలు( Sabja Seeds ) శరీరానికి కూలింగ్ ఎఫెక్ట్ మాత్రమే కాదు అనేక ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయి.

"""/"/ ముఖ్యంగా తలనొప్పి వేధిస్తున్నప్పుడు ఒక గ్లాస్ వాటర్ లేదా కొబ్బరి నీళ్ళల్లో పావు టేబుల్ స్పూన్ సబ్జా గింజలు వేసి ఐదు నిమిషాల పాటు నానబెట్టి తీసుకోవాలి.

ఈ విధంగా కనుక చేస్తే తలనొప్పి ఎంత తీవ్రంగా ఉన్నా సరే దెబ్బ‌కు ప‌రార్ అవుతుంది.

ఒకవేళ తరచూ తల నొప్పి వేధిస్తుంటే.అలాంటివారు నిత్యం సబ్జా గింజలు తీసుకునేందుకు ప్రయత్నించండి.

ఉదయం వాటర్ లేదా కొబ్బరి నీళ్ళల్లో( Coconut Water ) సబ్జా గింజలను నానబెట్టి తీసుకుంటే తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలు మీ వంక కూడా చూడవు.

"""/"/ అలాగే చేపల కంటే సబ్జా గింజల్లోనే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్( Omega 3 Fatty Acids ) అధికంగా ఉంటాయి.

అందువల్ల రోజూ ఈ గింజలు తీసుకుంటే గుండె సంబంధిత సమస్యలకు దూరంగా ఉండవచ్చు.

రక్తపోటు( Blood Pressure ) కూడా అదుపులో ఉంటుంది.అంతేకాదు సబ్జా గింజలను డైట్ లో చేర్చుకోవ‌డం వల్ల జీర్ణ క్రియ పనితీరు మెరుగు పడుతుంది.

మలబద్ధకం సమస్య ఉంటే దూరం అవుతుంది.ఇక మధుమేహం ఉన్న వారికి సబ్జా గింజలు ఒక వరం అని చెప్పవచ్చు.

సబ్జా గింజలు తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని పలు నివేదికలు తేల్చాయి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఫిబ్రవరి13, గురువారం 2025